చెవి నొప్పితో బాధ పడుతున్నారా? అయితే వీటిని ఫాలో అవండి

  • చెవి నొప్పి వచ్చిందంటే మనకు చాలా చిరాకుగా ఉండటమే కాకుండా ఏ పని మీదకు మనస్సు పోదు. చెవి నొప్పికి ఇంగ్లిష్ మందులు ఉన్నప్పటికీ సాధారణ చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం. 
  • రెండు వెల్లుల్లి రేకులను కొద్దిగా వేడి చేసి చిదిమి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదిలో పెట్టి చెవిలో పెడితే నొప్పి తొందరగా తగ్గుతుంది.
  • వెల్లుల్లి నూనె కూడా చెవి నొప్పిని తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి నూనె లేనప్పుడు మనకు అందుబాటులో ఉండే నూనెలో వెల్లుల్లి రేకలను చిదిమి వేసి మరిగించాలి. నూనె ముదురు రంగు వచ్చేవరకు మరిగించాలి. ఈ నూనె చల్లారిన తర్వాత ఉపయోగించాలి. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే…వేరుశనగ నూనెను ఉపయోగించకూడదు. 
  • బంతిలో ఉన్న ఔషధ గుణాలు కూడా చెవినొప్పిని తగ్గించటంలో సహాయపడతాయి. బంతి ఆకుల రసాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రాంతంలోరాయాలి.
  • తులసి రసం కూడా తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)