చుండ్రు మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తుందా...తక్షణం పోగొట్టే చిట్కాలు

చుండ్రు మనల్ని సమాజంలో తలెత్తుకోకుండా చేస్తుంది. ఎంత రెఢీ అయినా.. ఎంత కలర్ పుల్ డ్రెస్ వేసినా తలలో చుండ్రు ఉంటే మన పరువు గంగలో కలిసినట్టే. సహజంగా వచ్చే చుండ్రు ఒకటైతే అయితే.. మరోకటి మనకుండే డైలీ టెన్షన్స్ కూడా ఒక కారణం. ఇది వచ్చినప్పుడు చర్మం డ్రైగా మారుతుంది. దురద కూడా పెట్టవచ్చు. తలలో ఇలాంటి చర్మ సమస్యలు జనరల్ గా వింటర్, సమ్మర్లో మరింత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వింటర్లో తలలో అదనపు మాయిశ్చరైజర్ ఉత్పత్తి కావడం వల్ల తల డ్రైగా మారుతుంది. దాంతో తలలో దురద ప్రారంభమౌతుంది. అదనంగా చుండ్రు చేరుతుంది. అయితే ఈ చుండ్రును తక్షణం పోగొట్టడం ఎలా...!

ఈ సమస్యను తగ్గించుకోవడానికి, చుండ్రు నివారించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ పవర్ ఫుల్ బ్యూటీ ప్రొడక్ట్ లో నేచురల్ అసిడిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ గుణాలు తలలో చుండ్రు ఏర్పడకుండా చేస్తుంది. ఈ నేచురల్ రెమెడీ కెమికల్ ట్రీట్మెంట్స్ కంటే మరింత బెటర్ గా పనిచేస్తుంది. చుండ్రును తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించుకోవడం ఆరోగ్యకరం మరియు సురక్షితం.
వెనిగర్ + పుదీనా:
పుదీనా ఆకులను నుండి రసాన్నీ తీసుకోవాలి. దీనికి కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు పూర్తిగా అప్లై చేసి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ వెనిగర్ టిప్ చుండ్రును తగ్గిస్తుంది. పుదీనా మీ కేశాల వాసన మంచిగా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.
వెనిగర్ + పెరుగు:
జుట్టుకు వెనిగర్ ను అప్లై చేసి, 15నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. అరగంట తర్వాత పెరుగును తలకు మాస్క్ లా అప్లై చేయాలి. తర్వాత డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత తలస్నానం చేయాలి.
వెనిగర్ + టీట్రీ ఆియల్: 
మొదట ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలంతా తడపాలి. జుట్టు డ్రై అయిన తర్వాత టీ ట్రీ ఆయిల్ ను అప్లై చేయాలి. ఇప్పుడు తలను దువ్వుకొని, డ్రై అయ్యే వరకూ అలాగే ఉండాలి .
వెనిగర్ + ఆలివ్ ఆయిల్:
కొబ్బరినూనెకు ప్రత్యామ్నాయంగా ఆలివ్ ఆయిల్ సురక్షితం. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టుకు మరింత బెట్టర్ గా న్యూరిష్ చేస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేయాలి. తిరిగి ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలారా పోసుకోవాలి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే చుండ్రును నివారించుకోవచ్చు.
వెనిగర్ + మెంతి:
మెంతి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. 15 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
వెనిగర్ + తేనె: 
జుట్టుకు తేనెను అప్లై చేసి, 5 నిముసాల తర్వాత కడిగేయాలి . కొద్దిగా జుట్టు డ్రై అయిన తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ తో తలస్నానం చేయాలి. ఈ రెండు పదార్థాలలో బ్లీచింగ్ లక్షణాలుండటం వల్ల చుండ్రును చాలా ఎఫెక్టివ్ గా పోగొడుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)