పోలీసులు వాహనాన్ని ఆపి తాళం లాక్కోవడం ముమ్మాటికి తప్పేనని వాళ్ళకి ఆ హక్కు లేదని రవాణా శాఖ స్పష్టం చేసింది

మనం రోడ్డు పై మన వాహనంలో వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు.. వెంటనే వారు చేసే పని వాహనం కీ తీసుకోవటం. వాహనదారులు ప్రతి ఒక్కరికీ ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఇలా వాహనాన్ని ఆపి కీ తీసుకోవడం ముమ్మాటికి తప్పు, పోలీసులకి ఆ హక్కు లేదని ఆర్‌టిఎ తేల్చి చెప్పింది. హర్యానలోని సిర్పా ప్రాంతానికి చెందిన పవన్ పారిఖ్ అనే లాయర్ ఇలా కీ లాక్కోనే హక్కు పోలీసు కానిస్టేబుల్‌కి ఉందా అని ఆర్‌టిఎని ప్రశ్నించాడు. వెంటనే ఈ ఆంశం పై స్పందించిన రాష్ట్ర హోం శాఖ “అలా కీ తీసుకొనే హక్కు కానిస్టేబుల్‌కే కాదు, ఏ పోలీసు అధికారికి లేదు” తెలిపింది. పోలీసులకి ఈ విషయం తెలియక వారు అలా ప్రపర్తిస్తున్నారని పేర్కొంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)