ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వయసు 30 దాటాక తినే పద్ధతి మార్చాల్సిందే.. 30 ఏళ్లు దాటితే ఈరకంగా మేయింటేన్ చేస్తేనే ఆరోగ్యం

వయసులో ఉన్నప్పుడు ఏ సమస్య పెద్దగా కనిపించదు. ఇష్టమొచ్చింది, ఇష్టమొచ్చినట్లు తిన్నా పెద్దగా కష్టం అనిపించదు. శరీరంలో ఇప్పటికీఇప్పుడు మార్పులేమి కనబడకపోవచ్చు. కాని వయసులో ఉన్న అలవాట్ల ప్రభావం వయసు పెరిగినా కొద్ది కనబడుతుంది. 30 కి దగ్గర్లో పడ్డామంటే కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సిందే.
  • ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లుంటే మానెయ్యడమే మంచిది. ఇరవైల్లో ఉండే రోగనిరోధకశక్తి ముప్ఫైలో ఉండదు. క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి హాని చేసే ఏ అలవాటైనా సరే మానెయ్యాలి.
  • కాఫీ పొద్దున్నే శరీరంలో పడితే మంచిదే. కాని లిమిట్ లో ఉండాలి. వయసు పెరిగినా కొద్ది కాఫీ కప్పు సైజు తగ్గించండి.
  • నెలకోసారైనా ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోండి. శరీరంలోని మలినాలు క్లీన్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది.
  • 30 దాటాక తినే పద్ధతి మార్చాల్సిందే. ఆహర పరిమాణం తగ్గించాలి. ఎందుకంటే మెటబాలిజం స్పీడ్ తగ్గిపోతుంది. అలా జరిగితే ఊరికే లావెక్కుతారు. కాబట్టి డైట్ పరిమాణం తగ్గించి, డైట్ క్వాలిటి పెంచండి. పోషకాలు శరీరానికి బాగా అందేలా చూసుకోండి.
  • సాలాడ్స్ తినడం బాగా అలవాటు చేసుకోండి. 40,50 ల్లో పడ్డా కూడా మన హీరోలు కష్టపడి ఫైట్లు చేస్తున్నారంటే, వారికి సలాడ్స్ చేసిన సహాయం ఎంతో ఉంది. రా-ఫుడ్స్ తినడంపై దృష్టిపెట్టండి.
  • చిన్న చిన్న వర్కవుట్లు చేస్తూ ఉండాలి. కుదరకపోతే వాకింగ్ తో అయినా సరిపెట్టాలి. కాని ఎప్పుడూ ఒకేచోట కూర్చోని మాత్రం ఉండకూడదు.
  • శృంగార జీవిరం యవ్వనంలోనే కాదు, వయసు పెరిగినా సరే, ఎంతో అవసరం. కాబట్టి సెక్స్ లైఫ్ కి మీరెప్పుడు నిత్య యవ్వనులే. రెగ్యులర్ సెక్స్ ఉంటే అదే మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)