ప్రపంచంలో ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ లో మన సైనికులు ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసా? మైనస్ -50 డిగ్రీల చలి లో ఏమి తింటారో ఎలా ఉంటారో తెలిస్తే గుండె చలించిపోతుంది

Loading...
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శీతల యుద్ధభూమి! (మైనస్) -50 డిగ్రీల కన్నా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అత్యంత శీతల ప్రాంతం. అక్కడ దేశానికి ఉపయోగపడే ఖనిజ సంపద లేదు.. పంటలు పండే సారవంతమైన నేల కూడా లేదు! రక్తం కూడా గడ్డ కట్టే చలిలో సరిగ్గా ఊపిరి తీసుకోవడానికి కనీసం ఆక్సిజన్ కూడా దొరకదు. కేవలం కనపడేది.. ఎటు చూసినా ధవళ వర్ణంతో మిళ మిళ మెరిసిపోయే మంచుకొండలే.. అలాంటి నిరుపయోగమైన, జనసంచారం లేని ప్రాంతం కోసం మన దేశం ఏటా వేల కోట్లు ఖర్చుపెడుతుందంటే ఓ ప్రత్యేక కారణం ఉంది.. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే మీకు ముందు సియాచిన్ చరిత్ర తెలియాలి
సియాచిన్ అంటే అర్థమేంటో తెలుసా?
సియాచిన్ అనేది స్థానిక టిబెటన్ భాష అయిన ‘బాల్టీ’ భాష పదం. సియాచిన్ అర్థం.. ‘సియా’ అంటే గులాబీ… ‘చిన్’ అంటే సమృద్థిగా దొరికే వనం.. అర్థం ‘గులాబీల’ వనం. ఈ ప్రాంతంలో గులాబీ జాతికి చెందిన సియా అనే మొక్క ఎక్కువుగా పెరుగుతుంది. అందుకే, ఈప్రాంతానికి ‘సియాచిన్’ అనే పేరు వచ్చింది.
అసలు సియాచిన్ గొడవ ఎలా మొదలైంది ?
1947 లో ఇండియన్ సబ్ కాంటినెంట్‌ భారత్‌ - పాకిస్థాన్‌లుగా విడిపోయిన తర్వాత జమ్ముకశ్మీర్‌పై ఇరు దేశాల మధ్య గొడవ తలెత్తింది. తదనంతరం 1949 లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. పాక్ ఆక్రమించిన కశ్మీర్‌కు.. భారత్‌లో భాగమైన జమ్మూకశ్మీర్‌కు మధ్య సరిహద్దు రేఖకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే, సరిహద్దులో ఉన్న సియాచిన్ గ్లేసియర్‌పై ఈ ఒప్పందంలో ఇరు దేశాలు ఎటువంటి దృష్టి పెట్టలేదు. తదనంతరం, 70 వ దశకంలో.. సియాచిన్ ప్రాంతంలో విదేశీ పర్వతారోహకులకు పాక్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ప్రారంభించింది. తదనంతరం 1978 వ సంవత్సరంలో సియాచిన్ తమ దేశపు ప్రాంతంగా చెప్పుకుంటూ మ్యాప్‌లను రూపొందించడం ప్రారంభించింది. ఈనేపథ్యంలోనే, 1980 వ దశకం ప్రారంభంలో పాకిస్థాన్ తమ వైపు ఉన్న సియాచిన్ పర్వత ఫంక్తులను గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకోవడం ప్రారంభించింది. తదనంతరం 1984 లో రిమో-1 అనే పర్వతంపై పరిశోధనలకు జపాన్ సైంటిస్టులకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది. రెమో-1 భాగం సియాచిన్ తూర్పు భాగాన ఉంది. సియాచిన్‌ కు నైరుతి దిశలో చైనా.. ఈశాన్య దిశలో పాకిస్థాన్ ఉంది.. ఈ నేపథ్యంలోనే.. సియాచిన్ మొత్తాన్ని ఆక్రమించుకుంటే.. భారత్‌పై దాడికి చైనా నుంచి ప్రత్యక్షంగా సహాయం తీసుకోవచ్చని.. తద్వారా కశ్మీర్‌ ను కూడా ఆక్రమించుకోవచ్చని ఇస్లామాబాద్ వర్గాలు భావించాయి. ఈ పరిస్థితుల్లో సియాచిన్ ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు పాక్ దృష్టి పెట్టిందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పలు కీలక సమావేశాల అనంతరం సియాచిన్ స్వాధీనం చేసుకోవాలని భారత సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ‘ఆపరేషన్‌ మేఘదూత్’ పేరుతో జరిగిన ఈ సైనిక ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఆపరేషన్ కారణంగా సియాచిన్ లో మూడొంతుల భాగం భారత్ స్వాధీనమైంది. ఇలా, ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఆవిర్భావం జరిగింది.
సియాచిన్‌ మనకు అత్యంత కీలక ప్రాంతం. పాకిస్థాన్తో ఇప్పటి దాకా మనకు మూడు యుద్ధాలు జరిగాయి. మరో వైపు, చైనా మన భూభాగాన్ని ఎప్పుడు ఆక్రమించుకుందామా అని డేగ కళ్లతో చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాక్‌ కు చైనా సహాయం అందించాలంటే సియాచిన్ అనేది అత్యంత సులువైన మార్గం. ఈ నేపథ్యంలో, ఇక్కడ భారత్‌ ఖాళీ చేస్తే పాకిస్థాన్‌ కచ్చితంగా స్వాధీనం చేసుకుంటుంది. అలా చేస్తే.. పాకిస్థాన్‌- చైనాలు తదనంతరం కశ్మీర్‌ లోకి కూడా చొచ్చుకురావచ్చు! ఇలా జరిగితే, మన దేశం ప్రమాదంలో పడినట్లే! మరో వైపు ఈ సియాచిన్‌ను వదులుకుంటే ఉగ్ర మూకలు కూడా ఈ మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించే వీలుంది. ఈ కారణంగానే, మన దేశ ప్రభుత్వాలు ఏటా వేల కోట్లు సియాచిన్ రక్షణ కోసం ఖర్చుపెడుతన్నాయి. శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ఈ ప్రమాదం కారణంగానే.. తమ ప్రాణాలను ఫణంగా పెడుతూ.. ఇటు శత్రువులతోను.. అటు ప్రకృతితోను దేశం కోసం అనుక్షణం పోరాడుతున్న మన సైనికులకు సెల్యూట్ చేద్దాం.
సియాచిన్ లో మన సైనికులు ఎంతటి ఘోరమైన కష్టాలు పడుతున్నారో తెలుసా ?
దేశం కోసం.. దేశ ప్రజల కోసం సియాచిన్ ప్రాంతంలో మన సైనికులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఈ ప్రాంతంలో వాతావరణం అత్యంత దుర్భరంగా ఉంటుంది. కాళ్లు, చేతులు కున్న గ్లోవ్ల్‌ను క్షణకాలం తొలిగించినా.. తీవ్రమైన చలికి అవి చచ్చుబడిపోతాయి. నెలల తరబడి మంచులో పనిచేస్తున్న కారణంగా చాలా మంది సియాచిన్ సైనికులు కంటిచూపు పోగొట్టుకున్న పరిస్థితి! ఎక్కువ కాలం ఆక్సిజ్ మాస్క్‌లు ధరించడం వల్ల.. వినికిడి సమస్యలు, జ్ఞాపక శక్తి కోల్పోవడం జరుగుతున్నాయి. మంచు దెబ్బకు కాళ్లు, చేతులు వంకరలుపోవడం ఇక్కడ సర్వసాధారణం.. ఒంటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తీవ్రమైన తలనొప్పి, ఛాతినొప్పి, రక్తహీనత, వాంతులు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఇక్కడ భారతీయ సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు. అలాగే, స్పీచ్ సమస్యలు, నిద్రలేమి, డిప్రెషన్ లాంటి సమస్యలతో కూడా సియాచిన్ సైనికులు పోరాడుతున్నారు. ఇలాంటి సమస్యలతో ప్రతీ రోజు వందలాది మన సైనికులు సియాచిన్‌ బేస్ క్యాంప్‌ నుండి తరలింపబడుతున్నారు. ఇలా అనారోగ్యం పాలైన సైనికులు మళ్లీ.. ఏమాత్రం కాస్త కోలుకున్నా.. సియాచిన్ కొండల పైకి వెళ్లేందుకు వారు ఏమాత్రం అధైర్యపడటం లేదంటే వారి దేశభక్తి ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది.
సియాచిన్ పహారా కోసం రోజుకి మన ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో తెలుసా?
సియాచిన్ లో సైనిక సౌకర్యాలకు భారత్ రోజుకి పెడుతున్న ఖర్చు సమారు ఏడు కోట్లు.. అంటే సెకనుకు సుమారు 18 వేల రూపాయలకు పైగానే. ఈ లెక్కన.. అన్నీ కలుపుకుని ఏడాదికి సియాచిన్‌పై భారత ప్రభుత్వం ఖర్చు సుమారు మూడు వేల కోట్లు ఉంటుంది.
సియాచిన్‌లో 70 మైళ్ల మంచు సరిహద్దులో ఇరు దేశాల సైనిక మోహరింపు ఉంటుంది. 1984 నుంచి సియాచిన్ ప్రాంతంలో భారత్ కు చెందిన సైనికులు సమారు వెయ్యి మంది చనిపోగా, పాకిస్థాన్‌కు చెందిన సైనికులు సమారు 3 వేల మంది చనిపోయారు. ఇక, సియాచిన్ ప్రాంతంలో అను నిత్యం 7 వేల మంది భారత సైనికులు పహారా కాస్తుండగా.. పాకిస్థాన్ వైపు నుంచి 4 వేల మంది సైనికులు కాపలా కాస్తున్నారు.
సైనికుల ఆహారాన్ని కూడా మంచే తినేస్తుంది..
సియాచిన్‌ లో ఫ్రెష్ ఫుడ్ దొరకడం అసాధ్యం! తెచ్చిన వెంటనే తినకపోతే.. చలికి ఆపిల్‌ లాంటి పళ్లు నిమిషాల్లో క్రికెట్ బాల్స్ంత హార్డ్‌గా తయారయిపోతాయి. అసలు సముద్ర మట్టం నుంచి సుమారు 20 వేల అడుగులో ఎత్తుకు ఆహారాన్ని అందించడం దాదాపు అసాధ్యం! అయితే, మన దేశంలో తయారైన ‘చీతా హెలికాఫ్టర్స్’ ద్వారా మన దేశ ఆర్మీ పైలెట్లు ప్రతీ రోజు అత్యంత వ్యయప్రయాసలతో సియాచిన్ సైనికులకు ఆహారాన్ని సప్లై చేస్తున్నారు. ఒక్కో రోజు వాతావరణం తీవ్రంగా మారితే.. సైనికులకు ఆహారాన్ని కూడా మంచే మింగేస్తుంది. అలాంటి రోజున సైనికులు పస్తులుండాల్సిందే. ఓ అంచనా ప్రకారం.. రూ.2 కే తయారయ్యే సింగిల్‌ రోటీని.. సియాచిన్ సైనికులకు పంపించడానికి భారత ప్రభుత్వం పెడుతున్న ఖర్చు అక్షరాలా 220 రూపాయలు!
ఇక, సియాచిన్‌లో సైనికులకు కావాల్సిన నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్ధేశంలో.. ఆర్మీ టెక్నీషియన్స్‌ అత్యంత ధైర్య సాహసాలతో ఎంతో శ్రమకోర్చి.. అక్షరాలా సముద్ర మట్టానికి 21 వేల అడుగుల ఎత్తులో ఓ భారీ హెలిపాడ్ ను నిర్మించారు. ఈ హెలిపాడ్ పేరు ‘సోనమ్‌’. ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన హెలిపాడ్‌గా సోనమ్ రికార్డులకెక్కింది.
సియాచిన్ సైనికులు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తారో తెలుసా?
ఇక, సియాచిన్‌ లో భారత సైనికులు నెలకు ఓసారి మాత్రమే స్నానం చేస్తారు. అది కూడా ‘డీఆర్‌డీవో’ (DRDO) తయారు చేసిన స్పెషల్ బాత్‌ రూం కమోడ్స్‌లో మాత్రమే చేస్తారు. ఇక, మంచి నీరు తాగాలనిపిస్తే, ఐస్‌ ముక్కలను కిరోసిన్ స్టవ్‌ పై వేడిచేసుకుని దాహం తీర్చుకుంటారు. ఇక, సియాచిన్ లో చేతులతో తినడం.. చేతులు కడుక్కోవడం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే.. ఏమాత్రం గ్లోవ్స్ నుంచి చేతి వేళ్లు తీసినా పరిస్థితి దారుణం అయిపోతుంది. ఇక, ఒక్కో సైనికుడికి 14 జతల థెర్మల్ సాక్స్‌ ను ఆర్మీ ఇస్తుంది. తమ ధైర్మల్ సాక్స్ మార్చుకోవాలంటే.. డీఆర్‌డీవో ప్రత్యేకంగా తయారుచేసిన రూమ్స్‌కి వెళ్లి మార్చుకుంటారు. అలాగే, మన సైనికులంతా అనునిత్యం ఇంతటి శీతల వాతావరణంలో సరిహద్దు దగ్గర పెట్రోలింగ్ చేయడానికి కనీసం మోకాలు లోతు మంచులో రోజు కొన్ని మైళ్ల దూరం నడుస్తారు. ఒక్కసారి ఆలోచించండి.. -40 నుంచి -60 డిగ్రీల ఉష్ణోగ్రతలో మోకాలు లోతు మంచులో రోజుకి ఐదు నుంచి ఆరు మైళ్లు నడవటం ఎంతటి కష్టమో! ఇలా, పెట్రోలింగ్ చేస్తున్నప్పుడే.. హఠాత్తుగా మంచు తుపానులు విరుచుకుపడి మన సైనికులు ప్రాణాలను ఆర్పేస్తున్నాయి.
మంచు గాలులు.. మంచు తుపానులు వచ్చినప్పుడు భారత్ సైనికులు ఎక్కడ తలదాచుకుంటారో తెలుసా?
సియాచిన్‌లో పహారా కాస్తున్నప్పుడు ఎప్పుడైనా హఠాత్తుగా వాతావరణం మారితే.. ప్రాణాలు కాపాడుకోవడానికి భారత సైనికులు ఎక్కడి కక్కడ ఫైబర్ గ్లాస్ తో తయారుచేసిన ఇగ్‌లూస్‌.. Igloos.. అంటే అర్థచంద్రాకారపు గుడిసెలు నిర్మించుకుంటారు. ఈ గుడిసెలు మన బెడ్ రూంలో ఉండే డబుల్‌ బెడ్‌కాట్‌ అంత జాగా మాత్రమే ఉంటాయి. ఈ ఇగ్లూస్‌లో మినిమమ్ ఆరుగురు వరకు తలదాచుకుంటారు. ఇక, శీతల వాతావరణం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడితే.. మన సైనికులు కిరోసిన్ స్టవ్‌ను వెలిగించుకుని వేడిని పొందుతారు.
భారత్ సైనికుల దేశ భక్తిని, దేశం పట్ల వారి అంకిత భావాన్ని చూడండి, జై హింద్ జై జవాన్. ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవలసిన విషయం ఇది దయ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి.
Loading...

Popular Posts