ఈ లగ్నంలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ఇక ఆ భర్తకి తిరుగేలేదు.. జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు

ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అంత్యంత కీలక ఘట్టం. చేసుకోబోయే అమ్మాయి.. ఎలా ఉండాలో ఒక్కొక్కరికి ఒకలా నిర్దిష్టమైన ఆలోచనలుంటాయి. జీవితంలో మనసు తెలిసన, అందమైన అమ్మాయి తోడు దొరికితే… అంతకంటే కావాల్సిందేంలేదన్నది అబ్బాయిల్లో ఎక్కువ మంది మనోగతం.. అత్తమామలను, భర్త, పిల్లలను బాగా చూసుకొనే అమ్మాయి కావాలని ఏ అబ్బాయికి మాత్రం ఉండదు. అయితే ఇలాంటి అమ్మాయిల్ని చేసుకుంటే ఇక జీవితంలో తిరుగుండదని జ్యోతీష్య శాస్త్రం చెపుతోంది.
  • మేషలగ్నంలో పుట్టిన మహిళలు చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరి అందానికి పురుషులు దాసోహమవుతారని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ లగ్నంలో పుట్టిన మహిళలు గుణవంతులుగా ఉంటారు. వంట చేయటంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు.
  • ప్రేమతో మెలగటం వీరి స్వభావం. పొగడ్తలంటే వీరికి ఇష్టం. ఇంకా ఈ లగ్నంలో పుట్టిన మహిళలను వివాహం చేసుకునే పురుషులు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
  • మేషలగ్నంలో జన్మించిన పురుషుల విషయానికొస్తే.. తల్లిందండ్రుల వద్ద ప్రేమతో ఉంటారు. వీరికి అందంతో పాటు గుణవంతురాలైన భార్య లభిస్తుంది. భార్య పక్షంలోని బంధువుల సహాయం లోటుగానే ఉంటుంది. కుటుంబ అభివృద్దికి తీవ్రంగా శ్రమిస్తారు. కుటుంబంలో పలు సమస్యలు ఏర్పడటానికి కారణాలు ఉద్భవిస్తాయి. వాటిని సామర్థ్యవంతంగా పరిష్కరిస్తారు. మీ భాగస్వామి, సంతానం మీ మాటలను వినయంతో పాటిస్తారు. అయితే వారిని కొన్ని సందర్భాలలో తృప్తి పరచటం కష్టతరం.
  • జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే ఉబలాటం ఉంటుంది. కష్టపడి శ్రమించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. కళలంటే ఆసక్తి మెండు. పోలీసుశాఖ, సైన్యం, అగ్నిమాపక దళం వంటి శాఖల్లో రాణిస్తారు. ధైర్యం, మొండితనం ఎక్కువ. ప్రతి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్యంలో ఉన్నత పదవులను అలంకరిస్తారు.
  • జర్నలిస్టులు అయ్యే అవకాశాలున్నాయి. వృత్తి పరమైన వాటిలోనూ మంచి అభివృధ్ది ఉంటుంది. వ్యవసాయం, హోటల్ నిర్వాహం వీరికి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. కళలు అంటే వీరికి ఎక్కువ మక్కువ. ఆర్థిక శాఖలో మాత్రం కాస్త అభివృధ్ది అవకాశాలుండవు.
  • ఇతరులకు సహాయం చేసే గుణవంతులు. అయితే ఇతరులకు అప్పులిస్తే వాటిని తిరిగి పొందటం కష్టం. స్నేహితులు, కుటుంబంకోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు.
  • ఖర్చులు అధికంగా ఉండటంతో కాస్త ఇక్కట్లకు గురయ్యే పరిస్థితులు నెలకొంటాయని జ్యోతిష్కులు అంటున్నారు. అందుచేత ఈ లగ్నంలో పుట్టిన జాతకులు శుక్రవారం పూట అమ్మవారిని, శనివారం హనుమంతుడి ఆలయాలకు వెళ్లి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే ఈతిబాధలు, ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని వారు చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)