రెండు రోజులకి ఒకసారి ఇలా చేసినా చాలు ముఖం మెరిసిపోతుంది

Loading...
ఎండలో తిరిగొచ్చేసరికి ముఖంపై టాన్‌ పట్టేస్తుంది. దీనివల్ల ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంది. కాబట్టి కనీసం రెండు రోజులకోసారైనా టాన్‌ని వదిలించుకుంటే మంచిది. దీనికి వంటింట్లో దొరికే పదార్థాలనే ఉపయోగించుకోవచ్చు...
  • టమాటా గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత కడిగేసుకుంటే టాన్‌ పోవడంతో పాటు మంచి మెరుపు వస్తుంది. 
  • కీరదోస రసానికి గ్లిజరిన్‌, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే టాన్‌ పోవడమే కాక.. చర్మం రంగు మెరుగవుతుంది కూడా.
  • చిటికెడు పసుపు, ఒక స్పూను పాల పొడి, రెండు స్పూన్ల తేనె, అర చెక్క నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడిగేసుకోవాలి.
  • ఓట్స్‌ని పొడి చేసుకుని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని, మురికి పేరుకున్న చోట ఆ మిశ్రమంతో బాగా రుద్దితే టాన్‌ వదిలిపోతుంది.
  • మురికిని పోగొట్టుకోవడానికి మరో సులవైన పద్ధతి.. కొబ్బరి నీళ్లు. ముఖాన్నీ, చేతుల్నీ కొబ్బరినీళ్లతో కడుక్కుంటే నలుపుదనం పోతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
Loading...

Popular Posts