బరువు తగ్గాలంటే కాఫీలో పంచదార బదులు దీన్ని కలుపుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు

మామూలుగా ఉదయం నిద్ర లేవగానే టిఫిన్ తిన్న తరువాత చిక్కని కప్పు కాఫీ తాగుతుంటారు. ఇలా ప్రతిసారీ కాఫీలో చక్కెర వేసుకుని తాగడం వల్ల అధిక మొత్తంలో క్యాలరీలు శరీరంలోకి చేరి బరువు మాత్రం కచ్చితంగా పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు. అదే కాఫీలో చక్కెర బదులు ఒక స్పూను వెన్న కలుపుకుని తాగితే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ అని వారు చెబుతున్నారు. వెన్న కలిపి తాగడం వల్ల కొన్ని గంటల వరకూ ఆకలి అనేది వేయదనీ, దాని కారణంగా ఆహారం ద్వారా అధిక క్యాలరీలు శరీరంలో వచ్చి చేరే అవకాశం ఉండదని వారు అంటున్నారు. అదనపు క్యాలరీలు చేరకపోగా.. ఉన్న క్యాలరీలు ఖర్చు కావడం వల్ల బరువు తగ్గడం అనేది క్రమంగా జరుగుతుందని వీరి పరిశోధనల్లో రుజువైంది. బరువు తగ్గడంతో పాటు వెన్న కాఫీని తాగడం వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందని వీరు చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)