బాలుణ్ని నడిరోడ్డు మీద వదిలి మొబైల్‌లో గేమ్‌ ఆడుకుంటూ కూర్చుంది గేమ్‌ నుంచి బయటపడే సమయానికి ఆ చిన్నారి కారు కింద

మొబైల్‌ ఫోన్లు మానవ జీవితాలను ఎంతగా ఆక్రమించుకున్నాయో ఆలోచిస్తే భయం వేస్తుంది. ఆటలు లేవు, బంధువులను కలవడం లేదు.. సాటి మనుషులతో మాట్లాడడం లేదు.. అంతా మొబైల్‌తోనే. మొబైల్‌ మోజులో పడి కన్న కొడుకునే పట్టించుకోని ఓ యువతి.. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. సరిగ్గా నడవడం కూడా రాని ఆ బాలుణ్ని నడిరోడ్డు మీద వదిలి మొబైల్‌లో గేమ్‌ ఆడుకుంటూ కూర్చుంది. ఆ గేమ్‌ నుంచి బయటపడే సమయానికి ఆ చిన్నారి కారు కింద పడి విగత జీవిగా మారాడు.

చైనాలో గాంగ్జౌ ప్రావిన్స్‌లో జరిగింది ఈ ఘటన. షాపింగ్‌కని తన రెండేళ్ల కొడుకుతో బయల్దేరింది లిన్‌ అనే మహిళ. షాపింగ్‌ పూర్తయిన తర్వాత న్యూ వరల్డ్‌ షాపింగ్‌ మాల్‌ బయట తన కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని మొబైల్‌ తీసి గేమ్‌ ఆడడంలో నిమగ్నమైంది. ఈ లోపు ఆ చిన్నారి అక్కడ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ఆడడం మొదలుపెట్టాడు. అలా ఆడుతూ అటుగా వెళ్తున్న హ్యుందాయ్‌ కారు కింద పడి చనిపోయాడు. అయినా ఈ విషయం ఆ తల్లికి తెలియలేదు. చుట్టు పక్కల వాళ్లు వచ్చి చెబితేనే ఆమెకు విషయం తెలిసింది. అప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించింది. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)