మీ ముఖం ఎప్పటికి యంగ్ గా ఉండాలంటే అరటిపండుతో అద్భుతమైన పద్ధతులు

  • అరటిపండులో పోషకాలెక్కువ. అందుకే ఈ పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఆరోగ్యంతో పాటు అందాన్ని మెరుగుపరుస్తుంది. అరటిపండుతో ఫేస్‌ప్యాక్స్‌ సులభంగా తయారు చేసుకోవచ్చు.
  • అరటిపండును గుజ్జును ముఖం, మెడ ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో నిగారింపు వస్తుంది. 
  • సగం అరటిపండును, సగం అవకాడోను కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. 
  • ఒక కప్పులో సగం అరటిపండు పేస్ట్‌ను తీసుకుని అందులోకి టేబుల్‌స్పూన్‌ తేనెను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి. 
  • కప్పులో సగం అరటి పండును తీసుకుని అందులోకి తేనె, నిమ్మరసాన్ని టేబుల్‌ స్పూన్‌ చొప్పున కలపాలి. తర్వాత బాగా మిక్స్‌ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం మెరిసిపోతుంది. 
  • సగం అరటిపండును తీసుకుని దానికి తేనె, పెరుగును టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకుని మిశ్రమంగా చేసుకుని ముఖానికి పట్టిస్తే మంచి గుణం కనిపిస్తుంది. 
  • ముఖచర్మంపై ఉండే మృతకణాల్ని పోగొట్టాలంటే అరటిపండు, టేబుల్‌స్పూన్‌ తేనె, కోడిగుడ్డు పచ్చసొన కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)