ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకూడదు

Loading...
  • మార్నింగ్ నిద్రలేవడం కొంతమందికి చాలా కష్టం. అత్యవసరమైనపుడు అలారం పెట్టుకుంటారు. అలారం మోగినా.. మరో ఐదు నిముషాలు.. మరో పది నిముషాలు అంటూ అలారాన్ని మళ్లీ మళ్లీ సెట్ చేస్తూ కునుకులు తీస్తుంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. 
  • కళ్లు తెరవగానే ఫ్లోర్ పై కాళ్లు పెట్టడం వల్ల వెన్నెముక కండరాలు దెబ్బతింటాయి. అలాగే బ్లడ్ కాళ్లకు చేరిపోయి.. నొప్పికి కారణమవుతాయి. కాబట్టి కళ్లు తెరిచిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వండి. నిద్రలేచిన వెంటనే శరీరాన్ని అన్ని డైరెక్షన్స్ లో స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే రక్త ప్రసరణ శరీరమంతా వ్యాపించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 
  • నిద్రలేచేటప్పుడు చాలామంది హడావిడిగా లేస్తారు. బెడ్ రూమ్ నుంచి డైరెక్ట్ గా వంట గదిలోకి పరుగుపెడుతున్నారా ? అది అతి పెద్ద పొరపాటు. ఉదయం నిద్ర లేచినా కూడా శరీరానికి రెస్ట్ అవసరం. అవసరమైతే కాస్త త్వరగా లేవాలి కానీ.. హడావిడిగా నిద్ర లేవకూడదు
  • ఉదయం నిద్రలేవగానే కాసేపు మీకోసం మీరు కొంత టైం కేటాయించాలి. లాంగ్ వాక్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్ సైజ్, రీడింగ్.. ఇలా ఏదో ఒకటి చేయాలి
  • మీరు ఏ సమయానికి లేవగలరో ఆ సమయానికి అలారమ్ పెట్టుకోవడం, అలారమ్ మోగిన వెంటనే లేచే విధంగా శరీరానికి మైండ్ సెట్ చేయడం చాలా అవసరం. అలారం మోగిన వెంటనే లేచి.. బెడ్ పైనే శరీరానికి స్ట్రెచ్ ఇచ్చి.. డీప్ బ్రీత్ తీసుకుని రోజుని ప్రారంభించాలి.
  • వ్యాయామం చేయడానికి ఉదయం సరైన సమయం. కానీ కొంతమంది ఉదయం నిద్రలేవడానికి బద్ధకంగా అనిపించి.. సాయంత్రం పూట వ్యాయామాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఉదయం వ్యాయామం చేయటం వల్ల రోజంతా యాక్టివ్ గా, హెల్దీగా, హ్యాపీగా ఉంటారు. 
  • పనుల్లో నిమగ్నమై.. ఆకలిగా లేదంటూ చాలామంది రోజులో చాలా ముఖ్యమైన బ్రేక్ ఫాస్ట్ ని మానేస్తుంటారు. కానీ నిద్రలేచిన తర్వాత మెటబాలిజం స్లోగా ఉంటుంది. అది రీస్టార్ట్ అవ్వాలంటే శక్తి అవసరం. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ సరైన దారిలోకి రావాలంటే.. బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. 
  • నిద్రలేచిన తర్వాత 45 నిమిషాల నుంచి గంటలోపు ఏదో ఒకటి తీసుకోవాలి. ఎగ్స్, ఫ్రూట్ బౌల్, పాలు, నట్స్ ఇలా ఏదో ఒకటి తినడం చాలా ముఖ్యం. అలాగే ఉదయాన్నే పరగడుపున 2 నుంచి 3 గ్లాసుల నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 
  • ఉదయం లేవగానే రెడీ అవడం, హడావుడిగా బ్రేక్ ఫాస్ట్ చేయడం.. ఇలా హైరానా పడుతూ.. రోజుని ప్రారంభించేస్తున్నారా ? ఇలా గాబరాగా అన్ని పనులు చేసేసి ఆఫీస్ కి వెళ్తే మధ్యాహ్నానికి స్టామినా పడిపోవటం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
Loading...

Popular Posts