బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. భోజనం తరువాత చిన్న బెల్లం ముక్క తిన్నా చాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Loading...
స్వీట్ తింటే లావు అయిపోతామని.. షుగర్ వచ్చేస్తుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అయితే చక్కెరతో ప్రమాదం పొంచి ఉంది కానీ.. బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఇదివరకటి రోజుల్లో స్వీట్లు తయారు చేయాలంటే బెల్లమే ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం స్వీట్స్ అంటే చక్కెరకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బెల్లం వాడితే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

స్వీట్స్ తినడం ఇష్టం లేనివారు మధ్యాహ్నం కానీ, రాత్రి భోజనం తరువాత కానీ చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు, గ్యాస్, తలనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం కలిపి తాగినా.. టీలో చక్కెర బదులు బెల్లం కలిపి తీసుకున్నా మంచిది.

శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపి లివర్ ను శుద్ధి చేసే అద్భుతమైన గుణం బెల్లంలో ఉంది. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి.. మహిళలు తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత నివారించవచ్చు. ఇన్ని సద్గుణాలున్న బెల్లంను రెగ్యులర్ డైట్ లో కాస్త చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 
Loading...

Popular Posts