ఒక్కసారి చెప్పులతో ఇంట్లోకి వస్తే ఎన్ని లక్షల బాక్టీరియా ఇంట్లోకి వస్తుందో తెలుసా ? తెలిస్తే ఇక జన్మలో పొరపాటున కూడా చెప్పులతో ఇంట్లోకి రారు

ఇంటి బయట చెప్పులు వదిలి.. కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రావడం అనేది మన పెద్దలు నేర్పిన పద్ధతి. కానీ, ఇప్పుడు కిచెన్‌ లోకి కూడా చెప్పులతో వస్తున్నారు. అయితే ఇలా చెప్పులతో ఇంట్లోకి రావడం వల్ల లక్షల కొద్దీ బ్యాక్టీరియాను ఇంట్లోకి ఆహ్వానిస్తు న్నామని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అరిజోనా యూనివర్సిటీ బృందం చేసిన పరిశోధనల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. చెప్పులు, బూట్లు బయటే వదిలిరావడం అనేది సంప్రదాయమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంగీకరించాల్సిందే.

ఒక్కసారి పాదరక్షలతో ఇంట్లోకి వస్తే 4లక్షల21వేల జాతుల బ్యాక్టీరియాను ఇంట్లోకి తీసుకువస్తామట. చెప్పులతో పాటు ఇంట్లోకి వచ్చే ఈ బ్యాక్టీరియాలు అనేక వ్యాధులను కలుగుచేస్తాయట. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా జాతులు ఇంట్లోకి చేరి విరేచనాలు, వాంతులు, పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయట.

ముఖ్యంగా చిన్నారులు ఉన్న ఇంట్లోకి చెప్పులతో వస్తే.. అనేక రోగాలను తీసుకువచ్చినట్లే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వాకిలి బయటే చెప్పులు వదిలి రావాలన్న మన పెద్దల మాటలో ఎంతో ముందుచూపు దాగి ఉందని అంగీకరించక తప్పదు. సంప్రదాయంగా కాకుండా శాస్త్రంగా చూస్తే.. మన పెద్దలు నేర్పిన అలవాట్లలోని మంచి తెలుస్తుంది. చెప్పులు బయటే వదలడం వల్ల బ్యాక్టీరియాను నివారించడంతో పాటు 60శాతం కాలుష్యాన్ని, పెస్టిసైడ్స్‌ను ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చని ఈ తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)