ఒకప్పుడు హోటల్ లో గిన్నెలు కడిగిన వ్యక్తి..ఇప్పుడు 40 కోట్ల కంపెనీకి ఓనరు - ఎంతో స్ఫూర్తినిచ్చే నిజ జీవిత కథ మిస్ అవ్వద్దు

Loading...
పట్టుదల తెలివితేటలు ఉంటె ఏమైనా సాధించవచ్చు అని నిరూపించిన ఓ వ్యక్తి కథ ఇది.
తమిళనాడు తుటికోరిన్ జిల్లా నాగలాపురం లో ఒక నిరుపేద కుటుంబం లో పుట్టాడు ప్రేమ సాగర్. ఏడుగురు పిల్లల్ని కన్న ప్రేమసాగర్ తల్లిదండ్రులు, తనకి బాధ్యతలు తప్ప ఆస్తులు ఇవ్వలేదు. పైగా కుటుంబాన్ని పోషించడం కోసం 10 వ తరగతిలోనే చదువు మాన్పించి మద్రాస్ లో పనికి పెట్టారు. కేవలం 250 రూపాయల జీతం తో మద్రాస్ లో తను బతకడమే కష్టం అయ్యేది. ఇంటికి పంపడానికి డబ్బు మిగిలేది కాదు. ఒక ఫ్రెండ్ ముంబై లో మంచి ఉద్యోగం చూపిస్తాను, నెలకు 1200 జీతం ఇప్పిస్తానని చెప్పడం తో తనతో కలిసి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ముంబై ట్రైన్ ఎక్కేసాడు. ముంబై వెళ్ళాక ప్రేమసాగర్ దగ్గర ఉన్న 200 కొట్టేసి ఆ ఫ్రెండ్ జంప్ అయ్యాడు. చేతిలో చిల్లి గవ్వలేదు, ముంబై లో ఎవర్నైనా సహాయం అడుగుదామంటే తమిళం తప్ప మరో భాష రాదు. సాగర్ కష్టాలు చూసిన ఒక తమిళియన్, తనని ఒక గుడి దగ్గరకు తీసుకెళ్ళి, అక్కడ వారితో మాట్లాడి, చెన్నై తిరిగివెళ్ళేందుకు ట్రైన్ టికెట్ కొనిపించబోయాడు. అయితే సాగర్ తను చెన్నై వెళ్ళాలనుకోవడం లేదని, ఇక్కడే ఏదో ఒక పని చూసుకుంటానని అందుకు హెల్ప్ చేయమని అడిగారు. కొన్ని రోజులకి ఒక బేకరీ లో గిన్నెలు తోమే పనిలో చేరాడు. నెలకి 150 రూపాయల జీతం. రాత్రి అదే షాప్ లో పడుకునేందుకు అనుమతి .. 1990 లో ఇలా మొదలయింది ప్రేమసాగర్ ముంబై జీవితం.

ఆ తర్వాత రెండేళ్ళు ఇలా ఏదో ఒక పనిచేస్తూ, ఓ రెండు వేల రూపాయలు దాచుకున్నాడు. ఏ రెండు వేల పెట్టుబడి తో 1992 లో ఒక బండి అద్దెకి తీసుకుని, 1000 రూపాయలతో వంటపాత్రలు కొనుక్కుని, సొంత ఇడ్లీ వ్యాపారం మొదలు పెట్టాడు సాగర్. రోడ్డు పక్కన బండి పెట్టి ఇడ్లీ అమ్ముతున్నా, మిగతా వారికన్నా తను చాలా శుభ్రత పాటించేవాడు. పనిని ప్రేమిస్తూ అదే జీవితం అన్నట్లు ఎంతో శ్రద్ధగా పనిచేసేవాడు. కస్టమర్లని నవ్వుతూ పలకరించేవాడు. ప్రేమసాగర్ చూపించే ప్రేమ కి వినియోగదారులు ఆకర్షితులయ్యారు. క్రమేణా బిజినెస్ పెరిగింది. ఒక్కడే చేసుకోలేక తన తమ్ముళ్ళు ఇద్దర్ని చెన్నై నుండి ముంబై తీసుకెళ్ళాడు. అన్నదమ్ములు ముగ్గురూ చక్కగా తలకి టోపీ పెట్టుకుని, నీట్ గా డ్రెస్ చేసుకుని, కష్టమర్లని నవ్వుతూ పలకరిస్తూ, తమ వ్యాపారాన్ని పెంచుకోసాగారు. జీవితం సాఫీగా సాగిపోతోంది అనుకునేంతలో అనుకోని ఇబ్బందులు..

రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నందుకు మున్సిపల్ సిబ్బంది నుండి పోలీసుల నుండి వేధింపులు. పోలీసులు ఇడ్లీ బండి ని తీసుకెళ్ళిపోయేవారు. లంచాలు ఇచ్చి, ఫైన్ కట్టి విడిపించుకోవాల్సి వచ్చేది. ఇలా ఎన్నో సార్లు జరిగింది. అయితే చివరి సారి వాళ్ళు బండి జప్తు చేసేసరికి ప్రేమ సాగర్ దగ్గర కాస్త డబ్బు మిగిలిఉంది. ఈ బండి ఇలా నడవడం కష్టం అని అర్థం అయ్యాక తాము బండి పెట్టుకునే దానికి ఎదురుగా ఒక షాప్ రెంట్ కి తీసుకున్నారు. దానితో ఇడ్లీ బండి ప్రేమసాగర్ చిన్న హోటల్ కి ఓనర్ అయ్యాడు. ఆ హోటల్ పేరు ప్రేమసాగర్ దోశెప్లాజా. ప్రేమసాగర్ ఇడ్లీ తో పాటు దోశెలు ఆమ్మేవాడు. హోటల్ పెట్టాక, అక్కడికి స్టూడెంట్స్ రావడం మొదలయింది. స్టూడెంట్స్ తో ప్రేమసాగర్ కి పరిచయం స్నేహంగా మారింది. వాళ్ళు ప్రేమసాగర్ కి ఇంటర్నెట్ ఉపయోగించుకోవడం నేర్పారు. ఇది ప్రేమసాగర్ జీవితం లో అనూహ్య మార్పుని తెచ్చింది. ఇంటర్నెట్ సాయం తో రకరకాల దోశెల గురించి తెలుసుకున్నాడు. తానుకూడా దోశెలతో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. పనీర్ దోశె, స్ప్రింగ్ రోల్ దోశె ఇలా రకరకల దోశెలు చేయడం మొదలు పెట్టాడు. స్పందన తెలుసుకోవడం కోసం మొదట ఈ దోశె లని ఫ్రీగా ఇచ్చేవాడు, జనానికి నచ్చడం తో, వాటి లిస్టు పెంచుకుంటూ మొత్తం 26 రకాల దోశెలని ఇంట్రడ్యూస్ చేసాడు.

తొలి ఏడాది 26 వెరైటీలతో మొదలయిన ప్రయాణం 2002 నాటికి 105 వెరైటీలకి చేరింది. అప్పుడే ప్రేమ సాగర్ కి ఒక పెద్ద షాపింగ్ మాల్ లో తమ దోశెప్లాజా ఉంటె బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. ఎన్నో షాపింగ్ మాల్స్ వారిని అడిగినా “మాదగ్గర కేవలం బ్రాండెడ్ వస్తువులు, ఫుడ్ ఐటమ్స్ కి మాత్రమె స్టాల్స్ ఇస్తాము, మీలాంటి వారికి ఇవ్వము” అని తెగేసి చెప్పేవారు. అలా కాలం గడుస్తుండగా, సెంటర్ వన్ అనే మాల్ ముంబైలో ఓపెన్ అయింది. ఆ మాల్ మేనేజ్ మెంట్ లో పనిచేసేవారు, స్టాఫ్ చాలామంది ప్రేమసాగర్ దోశె ప్లాజా కి రెగ్యులర్ కష్టమర్లు. వారికి ప్రేమసాగర్ గురించి తెలుసుకాబట్టి, వారు రికమెండ్ చేసి, తమ మాల్ లో ప్రేమసాగర్ కి స్టాల్ ఇప్పించారు. దానితో ప్రేమసాగర్ దశ తిరిగింది. 105 రకాల దోశెలతో ముంబై లో ప్రేమసాగర్ పేరు మారుమోగింది. ఎంతోమంది దోశెప్లాజా ఫ్రాంచైజీలు ఇమ్మని అడగడం మొదలుపెట్టారు. పిండి మసాలాలు తమ దగ్గరే కొనాలి అనే కండిషన్ తో ప్రేమసాగర్ ఫ్రాంచైజీలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా అలా పెరుగుతున్న దోశెప్లాజా DR.D అనే పేరుతో బ్రాండ్ గా రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇండియా లో 11 రాష్ట్రాల్లో 50 దోశెప్లాజాలు ఉన్నాయి. న్యూజిలాండ్, గల్ఫ్ సహా చాల దేశాలకి ప్రేమసాగర్ దోశెలు విస్తరించాయి. ఇప్పుడు ఏడాదికి 40 కోట్లకి పైనే వ్యాపారం చేస్తున్నాడు ప్రేమసాగర్.. 
Loading...

Popular Posts