25 చెత్త పాస్‌వర్డ్స్ ఇవే.. ఈ లిస్టులో మీ పాస్‌వర్డ్ ఉంటే వెంటనే మార్చేయండి

Loading...
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కానీ.. ఒక్క పాస్‌వర్డ్ మాత్రం జీవితాన్ని మార్చేయడం ఖాయం. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అటు సోషల్ అంకౌట్స్‌కు సంబంధించి, ఇటు బ్యాంకు ఖాతాలకు సంబంధించి పాస్‌వర్డ్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన పాస్‌వర్డ్ ఇతరులకు తెలిస్తే మన అకౌంట్‌లోని డబ్బు మొత్తం మనది కాకుండా పోతుంది. అలాగే సోషల్ అకౌంట్‌ల విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు మన ఖాతలో అసభ్యకర లేదా ఇతర అనైతిక పోస్టులు కాని, ఫోటోలు కాని పోస్టు చేస్తే దానికీ మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత ఉన్న పాస్‌వర్డ్‌ను చాలా మంది తేలికగా గుర్తుండేలా, ఇతరులు కూడా అంచనా వేసేలా వీక్ పాస్‌వర్డ్స్‌ను ఉపయోగిస్తున్నారు.

స్ప్లాష్‌డేటా అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా25 చెత్త పాస్‌వర్డ్‌లను విడుదల చేసింది. ఎక్కువమంది వీటిని వాడుతున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆ సంస్థ పేర్కొంది. ప్రతి ఏడాది జనవరిలో ఎక్కువమంది ఎలాంటి పాస్‌వర్డ్స్‌ను వాడుతున్నారు అనేదానిపై స్ప్లాష్‌డేటా ఒక లిస్టును విడుదల చేస్తుంది. తాజాగా స్ప్లాష్‌డేటా విడుదల చేసిన లిస్టులో 123456, password ఎప్పటిలాగే ప్రధానంగా ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్, పాప్ కల్చర్‌ పదాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని స్ప్లాష్‌డేటా సీఈవో మోర్గాన్ స్లయిన్ పేర్కొన్నారు. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ను హ్యాకర్లు సులభంగా పసిగడతారని, కావున పాస్‌వర్డ్స్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మోర్గాన్ సూచించారు. స్పెషల్ క్యారెక్టర్స్‌తో కూడిన ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్స్‌నే వినియోగించాలని చాలా కంపెనీలు వినియోగదారులకు సూచిస్తాయన్నారు. పాస్‌వర్డ్ మ్యానేజర్స్‌ సాయంతో ఒక్కో అకౌంట్‌కు రాండమ్‌గా పాస్‌వర్డ్స్‌ను సెట్‌ చేసుకోవచ్చని, ఇలా చేస్తే కొంత వరకు సేఫ్ జోన్‌లో ఉన్నట్లేనని మోర్గాన్ చెప్పారు.

స్ప్లాష్‌డేటా ప్రకటించిన 25 చెత్త పాస్‌వర్డ్స్ ఇవే. మీరు వాడే పాస్‌వర్డ్స్ ఈ లిస్టులో ఉన్నట్లయితే వెంటనే మార్చేయడం మంచిది.

1. 123456

2. password

3. 12345678

4. qwerty

5. 12345

6. 123456789

7. football

8. 1234

9. 1234567

10. baseball

11. welcome

12. 1234567890

13. abc123

14. 111111

15. 1qaz2wsx

16. dragon

17. master

18. monkey

19. letmein

20. login

21. princess

22. qwertyuiop

23. solo

24. passw0rd

25. starwars
Loading...

Popular Posts