ఉదయం నుంచి రాత్రి వరకు బీర్‌లు తాగేవాడు.. రోజుకి 18 సార్లు సెక్స్ చేసాడు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

ఇంకో మూణ్నెళ్లకు మించి బతకలేవంటే ఎవరైనా నిరాశలో కూరుకుపోయి.. అంతకు ముందుగానే చనిపోతారు. అయితే లూసియానాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆ మూణ్నెళ్లలో జీవితాన్ని విచ్చలవిడిగా అనుభవించాలనుకున్నాడు. అదే అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడిందని చెబుతున్నాడు. నిజంగానే వైద్య రంగంలో ఇదొక అద్భుతమని డాక్టర్లు అంగీకరిస్తున్నారు.

లూసియానాకు చెందిన ఆడమ్‌ (55) అనే వ్యక్తికి తాను టెర్మినల్‌ క్యాన్సర్‌తో బాధపడుత్నుట్టు తెలిసింది. బ్రెయిన్‌లో ఏర్పడిన ట్యూమర్‌ వల్ల ఇంక మూణ్నెళ్లు మాత్రమే బతికే అవకాశముందని డాక్టర్లు చెప్పారు. అయినా అతను నిరాశ చెందుకుండా ఈ మూణ్నెళ్లలోనే జీవితాన్ని అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన శృంగార కార్యకలాపాలతోనే చివరి రోజులు గడపాలని భావించాడు. అతని మాటల్లో... ‘అప్పట్నుంచి నేను రాక్‌స్టార్‌లా మారిపోయాను. నాతోపాటు ఉండడానికి కొందరు అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చాను. వయాగ్రా ట్యాబ్లేట్స్ వేసుకుని వారితో రోజుకు 18 సార్లకు తక్కువ కాకుండా శృంగారంలో పాల్గొనే వాడిని. ప్రతీరోజు ఉదయం నుంచి రాత్రి వరకు బీర్‌లు తాగుతూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే నా జీవితం మొత్తంలో ఆ రోజుల్లోనే కింగ్‌లా బతికాను’ అని చెప్పాడు.

మూణ్నెళ్ల తర్వాత ఆడమ్‌ వైద్య పరీక్షల నిమిత్తం డాక్టర్‌ వద్దకు వెళ్లాడు. అయితే అతని బ్రెయిన్‌కు తీసిన స్కానింగ్‌లో డాక్టర్లకు ట్యూమర్‌ కనబడలేదు. దీంతో డాక్టర్‌ షాకయ్యాడు. ఆడమ్‌ ఈ మూణ్నెళ్ల కాలంలో ఏమి చేశాడో తెలుసుకున్నాడు. ఆ వివరాలన్నింటినీ ‘న్యూ ఓర్లాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రధాన పరిశోధకుడు అలన్‌ బేట్స్‌కు పంపించాడు.

అన్నింటీనీ పరిశీలించిన బేట్స్‌ అసలు విషయం బయటపెట్టారు. ‘రోజుకు అన్నిసార్లు శృంగారంలో పాల్గొనడం, డ్రగ్స్‌, ఆల్కహాల్‌ ఎవరికైనా కచ్చితంగా హాని చేస్తాయి. కానీ ఇతనికి మంచి చేశాయి. కొన్ని నెలలపాటు విరామం లేకుండా శృంగారంలో పాల్గొనడంతోపాటు డ్రగ్స్‌ వాడడం వల్ల పిట్యూటరీ గ్రంథి అధిక మోతాదులో ఎండార్ఫిన్‌ హార్మోన్‌ను విడుదల చేసింది. అధిక మోతాదులో విడుదలైన ఈ హార్మోనే అతని మెదడులోని ట్యూమర్‌ను కరిగించింద’ని వెల్లడించారు. అయితే, ఆడమ్ అనుభవం అందరికీ వర్తిస్తుందని భావించరాదని, అలా చేస్తే మరింత దారుణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశముందని హెచ్చరించారు. 
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)