వేడెక్కిన ఫోన్ పక్కనుంటే ప్రమాదంతో పాటు శృంగార జీవితంపై కూడా... మీ ఫోన్ వేడెక్కినప్పుడు ఇలా చేయండి

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్‌లే దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్‌ని వాడినా దాన్ని జాగ్రత్తగా వాడడం చాలా మందికి తెలియదు. ఒక్కోసారి ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే ఆఫ్ అయిపోవడం జరుగుతుంటుంది. ఇందతా పక్కన పెడితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మందిని వేదించే సమస్య ఒక్కటే అదే ‘ఫోన్ హీటెక్కడం’. ఈ సమస్య వల్ల ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు. అలాంటి సందర్భాలలో మొబైల్‌ని షర్ట్ పాకెట్‌లో పెట్టుకుంటే గుండె సంబంధిత జబ్బులు వస్తాయట. అంతేకాదు ప్యాంట్ పాకెట్‌లో పెట్టుకుంటే ఫోన్ వేడికి శుక్ర కణాల నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఎక్కువగా వాడడం అంటే కెమెరా ఆన్ చేసి ఉంచడం, ఎక్కువ సేపు నెట్ బ్రౌజింగ్ చేయడం, చార్జింగ్ ఎక్కువ సేపు పెట్టడం తదితర పనుల వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంటుంది.

అలాంటప్పుడు ఏంచేయాలంటే...

ఫోన్ బాగా వేడెక్కిన వెంటనే అందం కోసమో, రక్షణ కోసమో పెట్టిన కేస్(ప్యానెల్స్) తొలగించాలి. ఇలా తీసేయడం వల్ల ఫోన్‌‌లో అంతర్గతంగా జనరేట్ అయ్యే వేడి ఎప్పటికప్పడు బయటికి వెళ్లిపోతుంది. ఒకవేళ కేస్ లేకుండా కూడా వేడైతే ఫోన్‌ను దూరంగా గట్టి ప్రదేశంలో పెట్టేయాలి.
రన్నింగ్‌లో ఎక్కువ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుని ఒకవేళ ఉంటే వాటిని డిసేబుల్ చేయాలి.
ఇలాంటి సందర్భాలే తరచూ ఎదురవుతుంటే మీ ఫోన్‌లో రేడియేషన్ స్థాయిని చెక్ చేసుకోవాలి. మీ మొబైల్‌లో *#*07# టైప్ చేస్తే మీ మొబైల్‌లో రేడియేషన్ ఎంత ఉందో తెలిసిపోతుంది. సాధారణంగా ఫోన్‌లో 1.6 w/kgకి మించి ఉండకూడదు. దీనికి మించి ఉంటే మీ ఫోన్ వాడకుండా ఉండడమే మంచింది. ఫోన్ కొనే ముందు కూడా ఇది చెక్ చేసుకుని కొంటే ఉత్తమం. ఫోన్ కొనేముందు ఏ ఫోన్ కొంటున్నారో ఆ మోడల్ SAR వాల్యూ చూసుకోవాలి.
ఫోన్ చార్జింగ్ పెట్టే సమయంలో బెడ్, సోఫా వంటి మెత్తని వాటిపై కాకుండా గట్టి ఉపరితలం ఉండే వాటిపై పెట్టాలి. ఇలా చేస్తే చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వేడి అవదట.
ఫోన్ ఎక్కువ సేపు చార్జింగ్ పెడితే పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి రోజుకు 2 గంటలు మించి చార్జింగ్ పెట్టకూడదు.
బ్లూటూత్, హాట్ స్పాట్, వైఫై వంటి వాటిని వెంటనే డిజేబుల్ చేయాలి

ఈ యాప్స్‌తో చార్జింగ్ త్వరగా అయిపోతుంది
దేనికైనా జీవితకాల పరిమితి తప్పదు. మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీకి కూడా అంతే! అయితే ఫోన్‌లో మీరు ఉపయోగిస్తున్న కొన్ని యాప్స్‌ వల్ల బ్యాటరీ పనితనం వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాంటి యాప్స్‌ ఏమిటో చూద్దాం.

బ్యాటరీ సేవర్‌ యాప్స్‌
బ్యాటరీ సేవర్‌ లేదంటే రామ్‌ క్లీనింగ్‌ యాప్స్‌ అత్యంత త్వరగా బ్యాటరీని వీక్‌ చేస్తుంటాయి. ఎందుకంటే మీ స్మార్ట్‌ఫోన్‌ ఆఫ్‌లో ఉన్నప్పటికీ నెట్‌ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూనే ఉంటాయివి. కొన్ని యాప్స్‌ అయితే ఫోన్‌ను షట్‌డౌన్‌ చేయాలా వద్దా అనే చిన్న సూచన కూడా ఇవ్వకుండానే ఫోన్‌ను స్విచా్‌ఫ్‌ చేస్తుంటాయి. ఇటువంటి వాటిని వాడకండి.

ఫేస్‌బుక్‌
ఫేస్‌బుక్‌ లేనిదే గడవని రోజులు ఇవి. అయితే బ్యాటరీని త్వరితగతిన ఖర్చు చేసే యాప్స్‌లో ఇదొకటి. ఎఫ్‌బి కనక ఫోన్‌లో ఉందంటే ఛార్జింగ్‌కు పని పెరుగుతుందన్న మాట. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూనే నిత్యం నోటిఫికేషన్లను పంపిస్తుంటుంది ఎఫ్‌బి యాప్‌. దీంతో బ్యాటరీ మీద ఒత్తిడి పెరుగుతుంది. మెసెంజర్‌తో కూడా ఇదే ఇబ్బంది. మిగిలిన సోషల్‌మీడియా యాప్స్‌ స్నాప్‌చాట్‌, స్కైప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లదీ ఇదే తరహా సమస్య.

యాంటీవైరస్‌
బ్యాటరీని తినేసే యాప్స్‌లో యాంటీ-వైరస్‌, రామ్‌ మేనేజ్‌మెంట్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. ఇవి కూడా మిగిలిన వాటిలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూనే క్రమానుగతంగా ఫోన్‌ను స్కాన్‌ చేస్తుంటాయి. ఈ సమయంలో ఫోన్‌ ఫ్రీజ్‌ అయిపోయినట్లు అవుతుంది. ఎక్కువసేపు స్కాన్‌ చేయడం వల్ల బ్యాటరీకి పని పెరుగుతుంది.

ఫొటో ఎడిటింగ్‌
ఫొటో ఎడిటింగ్‌ యాప్స్‌ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న యూజర్లు.. స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకుని.. పదే పదే యాప్స్‌ద్వారా ఎడిట్‌ చేసి.. సోషల్‌మీడియాలో పోస్టు చేయడం అలవాటు. ఇలాగైతే మీ వెంట ఛార్జర్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. సహజంగా ఫొటో ఎడిటింగ్‌ యాప్స్‌ సైజ్‌ చాలా ఎక్కువ. ఒక ఇమేజ్‌ను ఎడిట్‌ చేసే ప్రాసె్‌సలో విపరీతమైన పవర్‌ అవసరం అవుతుంది. అడొబ్‌లైట్‌రూమ్‌, ఫొటోషాప్‌ ఎక్స్‌ప్రెస్‌, పిక్స్‌లర్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటివన్నీ ఇలాంటివే.

ఎక్స్‌ట్రా బ్రౌజర్‌
కొందరు ఒకే ఫోన్‌లో రెండుమూడు బ్రౌజర్లను వాడటం అలవాటు. అవసరం లేదనుకున్నప్పుడు అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం ఉత్తమం. లేదంటే కొన్ని బ్రౌజర్లు నిరంతరం పనిచేస్తూ నోటిఫికేషన్లు, అప్‌డేట్స్‌, న్యూస్‌ వంటివన్నీ పంపిస్తుంటాయి. దీనివల్ల కూడా బ్యాటరీ లైఫ్‌ వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

త్రీడీ గేమింగ్‌
బ్యాటరీని తినేసే యాప్స్‌లో మొదటివరుసలో ఉండేవి త్రీడీ గేమింగ్‌ యాప్స్‌. అస్‌పాల్ట్‌, ఇన్‌జస్టిస్‌, మోడ్రన్‌ కాంబట్‌ వంటివి కనక ఫోన్‌లో ఉంటే అంతే సంగతులు. ఈ మధ్యనే వచ్చిన రియాలిటీ యాప్‌ పోకెమన్‌ వంటి వాటితో అయితే బ్యాటరీ పని ముగిసినట్లే. ఇలాంటి యాప్స్‌ అన్నింటినీ లోడ్‌ చేసుకుని.. ఫోన్‌ స్పీడ్‌గా పనిచేయటం లేదంటే ఎలా చేస్తుంది? అందుకే బరువు తగ్గించండి. తక్కువ వాడే యాప్స్‌ను ఎప్పటికప్పుడు తీసేస్తుండండి. అది మీకూ మంచిది, మీ ఫోన్‌ బ్యాటరీకి మంచిది. మీ టైమ్‌ మిగులుతుంది. బ్యాటరీ టైమ్‌ పెరుగుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)