రూ.300 అప్పు చేసి ఒక స్కూల్ ప్రారంభించి ప్రపంచంలోనే ఉత్తమ స్కూల్ గా తీర్చిదిద్దాడు.. ఇలాంటి వ్యక్తి గురించి మన మీడియా ఏమాత్రం హైలైట్ చేయదు

నిజంగా నేడు మీడియా ఎలా మారిందంటే సినిమా వార్త‌ల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త ఇత‌ర ముఖ్య‌మైన వ్య‌క్తుల‌కు ఇవ్వ‌డం లేదు. దీంతో ఆయా రంగాల్లో విజ‌యవంతంగా ముందుకు దూసుకెళ్తున్న వారి గురించి అస్స‌లు చాలా మందికి తెలియ‌డం లేదు. ఇప్పుడు చెప్పబోయే ఈ వ్యక్తి గురించి ఏ మీడియా కూడా హైలైట్ చేయదు. కానీ అయన గురించి తెలిస్తే ఒక సినీ హీరో కంటే ఒక క్రికెట్ స్టార్ కంటే ఎక్కువ అభిమానిస్తారు.

ఇప్పుడంటే విద్యాసంస్థ‌ల‌న్నీ కార్పొరేట్‌మ‌యం అయిపోయాయి. చ‌దువు కంటే కూడా ఫీజుల వ‌సూలుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మాత్రం అలా కాదు. విద్యాసంస్థ అంటే అది స‌మాజానికి వెలుగునిచ్చే ఓ గొప్ప వేదిక‌గా, నేటి త‌రం విద్యార్థుల‌ను రేప‌టి త‌రం భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దే దేవాల‌యాలుగా ఉండేవి. అయితే భ‌విష్య‌త్తులోనూ పాఠ‌శాల‌లు అలాగే కొన‌సాగాల‌నే ఉద్దేశంతో అత‌ను ఓ స్కూల్‌ను చిన్న‌గా ప్రారంభించాడు. ఇప్పుడదే స్కూల్ దేశంలోనే ఉత్త‌మ స్కూల్‌గా పేరుగాంచింది, అంతేకాదు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. మ‌రి అలాంటి అత్యుత్త‌మమైన స్కూల్‌ను ప్రారంభించి న‌డిపిస్తుంది ఎవ‌రో తెలుసా..? అత‌నే జ‌గ‌దీష్ గాంధీ.

జ‌గ‌దీష్ గాంధీ త‌న భార్య భార‌తి గాంధీతో క‌లిసి 1959లో యూపీలోని ల‌క్నోలో సిటీ మాంటెస్సొరీ స్కూల్ (సీఎంఎస్‌) ను ప్రారంభించారు. అందుకు అప్పుడు వారికి అయిన ఖ‌ర్చు ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.300. అది కూడా అప్పు తెచ్చి స్కూల్‌ను పెట్టారు. మొద‌ట్లో స్కూల్‌లో కేవ‌లం 5 మంది మాత్ర‌మే ఉండేవారు. అయితే 2010-11లో ఆ స్కూల్‌లో ఉన్న విద్యార్థులు ఎంత మందో తెలుసా..? 39,437 మంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ‘Glory be to the World (ప్ర‌పంచం ప్రకాశిస్తుంది)’ అనే నినాదంతో ప్రారంభ‌మైన ఆ స్కూల్‌లో నాణ్యమైన విద్య‌, ఉత్త‌మ‌మైన విద్యాప్ర‌మాణాల‌ను పాటిస్తుండ‌డంతో అంచెలంచెలుగా ఎదిగి ఆ స్కూల్ అంత‌టి స్థాయికి చేరుకుంది. అందుకే అందులో అన్ని వేల మంది విద్యార్థులు చ‌దువుతున్నారు. దీంతో ఆ స్కూల్ ఓ న‌గ‌రంలో అత్య‌ధిక సంఖ్య‌లో విద్యార్థుల‌ను క‌లిగిన స్కూల్‌గా గిన్నిస్ రికార్డుల‌కు ఎక్కింది. ఇప్పుడు అంటే 2016లో ఆ స్కూల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్య 52వేలు.

సిటీ మాంటెస్సొరీ స్కూల్‌కు ఇప్పుడు ల‌క్నో న‌గ‌రంలోనే 20 దాకా బ్రాంచ్‌లు ఉన్నాయి. ఆ స్కూల్‌లో నెల‌కు రెండు అంత‌ర్జాతీయ ఈవెంట్లు కూడా జ‌రుగుతాయి. వాటిలో ఇప్ప‌టి వ‌ర‌కు ద‌లైలామా, భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి, స్వ‌ర్గీయ ఏపీజే అబ్దుల్ క‌లాం వంటి ప్ర‌ముఖులు ప్ర‌సంగించారు కూడా. అక్క‌డి విద్యార్థుల‌కు క‌లాం అంటే ఎంత‌గానో అభిమానం. ఆయ‌నంటే వారంద‌రికీ ఆద‌ర్శం. అందుకే అక్క‌డ చ‌దువుకునే విద్యార్థులు అమోఘ‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తుంటారు. ఇంగ్లిష్‌తోపాటు ప‌లు సైన్స్ స‌బ్జెక్టుల్లో టాప్ ర్యాంకులు అక్క‌డి వారికి వ‌స్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)