ఈ 6 దేశాల ప్రజలకు ఇండియా అంటే.. యమా గౌరవం, ఎందుకో తెలుసా ?

ప్రపంచంలోనే సనాతన సంస్కృతీ, సంప్ర‌దాయ‌ల‌కు పుట్టినిల్లు మనదేశం. ప్ర‌పంచంలోనే అత్యంత గొప్ప‌ చ‌రిత్ర క‌లిగిన దేశం భార‌త్. అందుకే మన దేశం అంటే చాలా దేశాల‌కు గౌర‌వం, అభిమానం. ఇక్క‌డి సంస్కృతులు, సంప్ర‌దాయ‌ల‌ను, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లను తెగ ఇష్ట‌ప‌డుతుంటారు. కొన్ని దేశాల ప్రజలైతే ఇక్క‌డే ఉండిపోవ‌డానికి ఇష్ట‌ప‌డతారంటే మ‌న దేశ గొప్ప‌త‌నం ఏంటో ఇట్టే తెలుస్తుంది. మ‌న కంటే అభివృద్దిలో వంద‌ల రెట్లు ముందున్న దేశాలు సైతం మ‌నల్ని ఎంతగానో గౌర‌విస్తున్నాయి. అందుకు కార‌ణాలేంటి.. ఇంతకూ ఏ ఏ దేశాలకు భార‌త‌దేశ‌మంటే గౌర‌వ‌మో తెలుసుకుందాం.. 

జపాన్ :- ప్ర‌పంచంలోనే అభివృద్దిలో శ‌ర‌వేగంగా దూసుకెళుతోంది. అయినా ఈ దేశానికి భార‌త‌దేశ‌మంటే చాలా గౌర‌వం. కార‌ణం వారు పాటిస్తున్న మ‌తం మ‌న దేశంలోనే పుట్ట‌డ‌మే.
ఇట‌లీ :- ఈ దేశస్తులకు మ‌న సంస్కృతి బాగా న‌చ్చుతుంది. వారి కుటుంబ వ్య‌వ‌స్థ భార‌త్ ను పోలి ఉంటుంది. ఉమ్మ‌డి కుటుంబాల‌కి, బంధాల‌కి, బంధుత్వాల‌కి ప్రాదాన్య‌త ఇస్తారు ఇట‌లీ వాసులు.
తైవాన్ :- ఈ దేశం వారికి మన దేశ‌మ‌న్నా, ఇక్క‌డి మ‌నుషులన్నా చాలా ఇష్టం. భార‌త ప్ర‌జ‌ల మీద ఎన‌లేని అభిమానాన్ని చూపిస్తారు. కార‌ణం స్నేహ‌భావంతో మెలుగుతార‌నే..
కాంబోడియా :- ఈ దేశంలోని చాలా గుళ్ల‌లో మ‌న దేవుళ్లే ఉంటారు. వారి పూజా విధానం మ‌నకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. మన సంస్కృతుల‌న్నా, సంప్ర‌దాయ‌ల‌న్నా చాలా గౌర‌విస్తారు.
ర‌ష్యా :- భార‌త్ అంటే ఈ దేశానికి అభిమానం ఎక్కువే. శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడ‌నే నీతిని ఈ దేశం ఎక్కువ‌గా పాటిస్తుంది. భార‌త్ ను అభిమానించాడానికి ప్ర‌ధాన కార‌ణం అమెరికా దృష్టిలో భార‌త్ శ‌త్రుత్వ దేశంగా ఉండ‌టం.
ఇంగ్లాండ్ :- నిజానికి భార‌త్ కు ఒక‌ప్పుడు శ‌త్రు రాజ్యంగా ఉన్న ప్ర‌స్తుతం మాత్రం భార‌త్ అంటే ఎన‌లేని గౌర‌వం, అభిమానం. కార‌ణం వేల ఏళ్లు మనల్ని పాలించిన బ్రిటిష్ పాలకులు పోయేప్పుడు కాసింత ఇక్క‌డి మంచి త‌నాన్ని మూట‌గ‌ట్టుకుని వెళ్ల‌డ‌మే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)