ఈ మూడు రాశుల అమ్మాయిలని పెళ్లి చేసుకుంటే ఇక మీకు తిరుగుండదు... జీవితాంతం సంతోషమే

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. వైవాహిక జీవితం సాఫీగా సాగితేనే అది సాధ్యం. లేకపోతే జీవితాంతం మంటే. పెళ్లి సంబంధం విషయంలో కుల, గోత్రాలు పట్టింపులు ఎక్కువే. అలాగే వధూవరుల జాతకాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి. జన్మరాశులకు సరిపోయిన వారిని ఎంపిక చేసి వివాహం జరిపిస్తారు. ఎందుకంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆనందాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుతారు.

అయితే కొన్ని జన్మ రాశులున్న మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితానికి ఎదురే ఉండదని హిందూ పండితులు అంటున్నారు. వీటిలో 
మేష, కర్కాటక, సింహ రాశి వారిని చేసుకోవాలని సూచిస్తున్నారు.

కర్కాటక రాశి మహిళల్లో అత్యధిక సంప్రదాయ లక్షణాలు ఉంటాయి. ఈ రాశి మహిళలు సున్నితమైన వారు, ఇతరులపై ఆధారపడి జీవనం సాగిస్తారు, అలాగే వీరిలో ఆరాధన భావంతోపాటు గ్రహణశక్తి కూడా ఎక్కువే. భర్తకు అనుకూలంగా ఉంటారు. వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తుంది. తన చివరి ఊపిరి వరకు జీవిత భాగస్వామిని అట్టిపెట్టుకుని ఉంటారు.

మేష రాశి స్త్రీలు భర్త అడుగు జాడల్లోనే నడుస్తారు. అలాగే సమర్థుడైన భర్త తన పక్కన ఉండాలని కోరుకుంటారు. ప్రతి పనిలోనూ ఆమె మార్క్ కనిపిస్తుంది. తన భర్త, కుటుంబ పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసుండాలని కోరుకుంటుంది. తన బాధ్యతల నుంచి ఎప్పుడూ పక్కకు తప్పుకునే ఆలోచన ఉండదు.

సింహరాశి మహిళలు చాలా శక్తిమంతులు, అలాగే ఆకర్షణీయంతోపాటు సెక్సీగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే సత్తా ఉంటుంది. చిన్నతనంలో వీళ్లు పితృస్వామ్య వాతావరణంలో పెరిగి ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)