ఈ దేశంలో బ్రతకాలంటే మైనారిటీగా లేదా దళితునిగా పుట్టాలి

Loading...
ఈ దేశంలో మెజారిటీ మతం ప్రజల, దళితేతర వర్ణాల హక్కులు హరించివేయ బడుతున్నాయి. మన దేశ రాజ్యాంగం, ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఈ దేశంలో ప్రజలని కులాల వారీగా, మతాల వారీగా విభజించి రిజర్వేషన్లు కల్పించారో ఆ రోజే ఈ అసమానతలకు బీజం పడింది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత రచించిన రాజ్యాంగంలో సమాజంలో వెనుక బడిన, అణచివేయ బడిన వర్గాల ఆర్ధిక, సామాజిక స్థాయి మెరుగు పడాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల కాలం పాటు రిజర్వేషన్లు ఉండాలని నిర్ణయించారు. అది మంచి నిర్ణయమే కానీ, స్వాతంత్రం వచ్చి 69 సంవత్సరాలైనా రిజర్వేషన్ల ఎత్తివేతపై పునస్సమీక్ష జరగలేదు సరికదా! రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఎన్నో కులాలను ఆ జాబితాలో కొత్తగా చేరుస్తూ రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచుకుంటూ పోయారు.

IAS అధికారి కొడుకైనా.. మంత్రి కొడుకైనా సరే! దళితుడైతే చాలు అతనికి ప్రతిభ... లేకున్నా, ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా రిజర్వేషన్ కోటాలో మంచి కాలేజిలో ఉచిత విద్యతో పాటు, ఉచిత హాస్టల్ వసతే కాకుండా ఉపకార వేతనం కూడా లభిస్తుంది, ఆ తరువాత మంచి ఉద్యోగం వస్తుంది. ప్రమోషన్ లో కూడా అతని సీనియారిటీతో సంబంధం లేకుండా పెద్ద పీట వేస్తారు. ప్రపంచంలో ఇంత దిక్కుమాలిన వ్యవస్థ మరే దేశంలోనూ లెదు...

దళితులకు ఈ దేశంలో ప్రత్యెక హక్కులున్నాయి.. వారిని కులం పేరుతో సంబోధిస్తే నేరం... వారి పేరు వెనుక వారి కులాన్ని సూచించే పదం ఉన్నప్పుడు కూడా మనం వారిని ఆ పేరుతొ సంబోధిస్తే నేరమే! (ఉదా: రెడ్డి, చౌదరి, నాయుడు, యాదవ్, గౌడ్ వంటి కులాన్ని సూచించే పదాలు తమ పేరు పక్కన తోకగా తగిలించుకున్న వారిని ఆ పదంతో సంబోధిస్తే తప్పు కాదు కానీ... మాల, మాదిగ మరింకేవైనా పదాలు తమ పేరు వెనుక తగిలించుకున్న వారిని సైతం మనం ఆ పదంతో సంభోదిస్తే మనం భారత న్యాయ వ్యవస్థలోని SC/ST చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ నేరం క్రింద అరెస్టయ్యి జైలు ఊసలు లెక్కబెట్టవలసిందే. ఇదంతా మన రాజ్యాంగం, చట్టాల మహిమ...)

ఎక్కడైనా నేరం జరిగినప్పుడు బాధితుడు దళితేతరుడు లేదా మెజారిటీ మతానికి చెందిన వాడై.. నేరస్తుడు దళితుడు లేదా మైనారిటీ వర్గానికి చెందిన వాడైతే వాడి గురించి ఏ రాజకీయ నాయకుడు, పార్టీలు లేదా పౌర హక్కుల సంఘాలు కూడా పట్టించుకోరు.. అదే కనుక బాధితుడు దళితుడు కానీ మైనారిటీ వర్గానికి చెందిన వాడైతే వెంటనే ఈ కుళ్ళు రాజకీయ నాయకులు, పార్టీలు, సంఘాలు గద్దల్లా వాలిపోయి సమస్యను మరింత జటిలం చేసి.. అగ్నికి ఆజ్యం పోసి తమ శాడిజాన్ని చలి కాచుకుంటారు.

ఈ దేశంలో దళితేతరుడు లేదా మెజారిటీ మతం వారి ప్రాణానికి యెంత మాత్రం విలువ లేదు... ప్రతిభ ఉన్నా కానీ రిజర్వేషన్ల కారణంగా అవకాశాలు కోల్పోయి బ్రతకటానికి మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పేద వారి ప్రాణాలకు ఏ మాత్రం విలువ కట్టని ఈ వ్యవస్థ, రాజకీయ నాయకులు అదే ఏ దళితుడో లేక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తో ఏ కారణం చేతనైనా ఆత్మహత్య చేసుకుంటే అతని ప్రాణానికి లక్షల్లో, కోట్లల్లో విలువ కట్టటమే కాకుండా అతని కుటంబంలో వారికి ఉద్యోగం, వారికి నివాసం కూడా ప్రభుత్వం కల్పించాలని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తారు. ఇదేమి న్యాయమో మనం.. మన న్యాయ వ్యవస్థను ప్రశ్నించగలమా? చట్టాలు కూడా వీరికి చుట్టాలుగా మారాయి.

చిలకలూరిపేట బస్సు దహనం కేసులో 23 మంది అమాయక ప్రాణాలను బలిగొన్న హంతకులకు దళితులనే కారణంతో శిక్షలను తగ్గించటమే కాకుండా ముందుగానే విడుదల చేయటం బహుశా ఈ దేశంలోనే చెల్లుబాటవుతుందేమో!

హిందూ మతంలో భాగమైన కులం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు మతం మారినా కానీ చెల్లుబాటు అవుతున్నాయంటే అంత కంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? మతం పనికిరానిదైపోయి వేరే మతంలోకి మారుతున్న వారికి మరి ఆ మతం లోని కులం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్ల ప్రయోజనాలు మాత్రం ఎందుకు?

బలహీనుడికి అన్నం పెడితే తప్పు లేదు కానీ.. బలవంతుడి ముందు అన్నం లాక్కుని బలహీనుడికి పెడితే కొంత కాలానికి బలహీనుడు బలిసిపోతాడు.. అదే సమయంలో బలవంతుడు బలహీనుడై ఆకలితో మరణిస్తాడు... ప్రభుత్వాలు కూడా ఇదే విషయం గుర్తు పెట్టుకోవాలి.. అగ్ర వర్ణాలుగా ముద్ర వేసిన కులాల వారిలో నిరు పేదల శాతం ఎక్కువగా ఉంది 69 సంవత్సరాల నుండి రిజర్వేషన్ల ఫలాలు అంది పుచ్చుకున్న దళితుల్లో ధనికుల శాతం అధికంగా ఉంది.. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రతిభ కల అగ్ర వర్ణాల పేదలు నష్టపోరాదు..

గాంధీ, నెహ్రూ వంటి నాయకులను మనం దేశ నాయకులుగానే చూశామే తప్ప ఏ నాడూ కుల నాయకులనే ద్రుస్థితో చూడలేదు. ఈ దేశంలో శలవు దినాలు కూడా కులాల ప్రాతిపదికన ఏర్పాటు చేయటం మన దౌర్భాగ్యం.. స్వాతంత్రం వచ్చిన నాలుగు దశాబ్దాల తరువాత కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దళిత నాయకులుగా గుర్తిస్తూ అంబేద్కర్, జగజీవన్ రామ్ జయంతులను ప్రభుత్వం శలవు దినాలుగా ప్రకటించటం సిగ్గు చేటు.. స్వాతంత్ర సమరంలో అసువులు బాసిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు వంటి అమర వీరులు దళితులు కానందు వలనే నిర్లక్ష్యం చేయబడ్డారా? వీరి జయంతులు, వర్ధంతులు ప్రభుత్వం తరపున నిర్వహించక పోవటానికి కారణం ఏమిటి?

ఇక ఈ దేశంలో మైనారిటీల విషయానికి వస్తే! వారికి రాజ్యాంగం కొన్ని ప్రత్యెక హక్కులు ప్రసాదించింది అలాగే వారికి ఉద్యోగాల్లో, విద్యాలయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించారు. మైనారిటీలను ఓటు బ్యాంకుగా మాత్రమె గుర్తిస్తున్న కొంతమంది కుహనా లౌకిక వాదులు వారి రాజకీయ స్వార్ధం కోసం ఈ దేశంలో మైనారిటిలను రెచ్చగొడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. మెజారిటీ ప్రజల హక్కులకు భంగం వాటిల్లినా పట్టించుకోని నాయకులు మైనారిటీ ప్రజలపై ఈగ వాలినా కూడా సహించలేకపోతున్నారు.

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు హజ్ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కొంత మంది ముస్లిం యాత్రికులు పవిత్ర స్థలం మక్కా వెళ్ళి రావటానికి ఆర్ధిక సహాయం చేస్తున్నాయి. పెద్దోడైనా, పేదోడైనా ఈ సహాయం వినియోగించు కోవచ్చు... ఎక్కడో దూరాన ఉన్న మక్కా వెళ్లి రావటానికి ముస్లింలకు వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరి పేద హిందువులకు తిరుపతి, లేదా మరేదైనా హిందువుల పుణ్య క్షేత్రాలకు వెళ్లి రావటానికి ప్రత్యెక బోర్డు ఏర్పాటు చేసి ధన సహాయం ఎందుకు చేయవు?

ఏ దేశంలోనో మహమద్ ప్రవక్తకు అవమానం జరిగిందనే కారణంతో ఈ దేశంలో బందులు జరుపుతారు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు కనీసం ఖండించటానికి కూడా వెనుకాడతారు. ఈ దేశంలో హిందూ దేవుళ్ళను కించపరుస్తూ కార్టూన్లు వేసినా.. సినిమాలు తీసినా.. రాతలు రాసినా.. విగ్రహాలు ధ్వంసం చేసినా కానీ ఎవ్వరూ పట్టించుకునే సాహసం చేయరు. కొన్ని హిందూ దేవాలయాల్లో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం స్త్రీలను అనుమతించక పోవటాన్ని తప్పుపడుతూ ప్రకటనలు, ఆందోళనలు చేస్తున్న ఈ కొజ్జా లౌకిక వాదులు మరి మసీదుల్లో ప్రార్ధనలకు స్త్రీలను కూడా అనుమతించమని, ముస్లిం మహిళలకు పరదాల సంకెళ్ళను తొలగించమని ఎందుకు ఆందోళనలు చేయరు?

హిందువులన్నా... దళితేతరులన్నా ఈ రాజకీయ నాయకులకు, పార్టీలకు అంత అలుసెందుకు! వారి సహనాన్ని వీళ్ళు చేతకానితనంగా భావించి వారి హక్కులకు భంగం కలిగిస్తూ.. వారి పట్ల అణచివేత ధోరణి అవలంబిస్తే అది బెడిసికొట్టే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దేశంలో అణచివేయ బడుతున్న.. హక్కులు కోల్పోతున్న హిందువులు .. దళితేతరులు ఇక్యమైతే రాబోయే కాలంలో ఈ కుహనా రాజకీయ నాయకులు, లౌకిక వాదులుగా చెప్పుకొనే నపుంసక వాదుల రాజకీయ క్రీడకు తెరపడే రోజొకటి వస్తుంది.. ఖబడ్దార్!!
Loading...

Popular Posts