అమ్మాయిలకు ఆ ఒక్కటీ చాలా సీక్రెటట !అందం విషయంలో ఆడవాళ్లకు ఆడవారే శత్రువులని మనం తర తరాలుగా వింటూనే ఉన్నాం. ఆ విషయాన్నే బలపరుస్తూ ఇటీవల ఓ అధ్యయనం కొన్ని ఆసక్తికర విషయాలు ల్లడించింది. అదేమిటంటే అమ్మాయిలు తాము వాడే పర్‌ఫ్యూమ్‌ల పేర్లను చాలా రహస్యంగా ఉంచుతారట. ఒక అమ్మాయి తన స్నేహితురాలికి ఎలాంటి గిఫ్ట్ అయినా ఇస్తుందట కాని.. ఒక్క తాను ఉపయోగించే సెంట్ బాటిల్ తప్ప. అదేంటోగాని తాను ఉపయోగించే సుగంధ ద్రవ్యాన్ని చచ్చినా తోటి ఆడపిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడరట. వారు పర్‌ఫ్యూమ్‌ను తమ వ్యక్తిగత గుర్తింపుకు సింబల్‌గా భావిస్తారని ఇటీవల జర్నల్ ఫుడ్ క్వాలిటీ అండ్ ప్రిఫరెన్సెస్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది.

అంతేకాదు.. అమ్మాయిలు తమకు నచ్చిన ఒకే రకమైన పర్‌ఫ్యూమ్‌ని ఏళ్ల తరబడి ఉపయోగిస్తారట. స్నేహితురాళ్లకు ఇవ్వరు గాని, అదే దాన్ని వారి బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికి బాగా ఇష్టపడతారట. ఇది అమెరికాలోని బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డిజైన్ ఇంజినీర్‌గా పని చేసే బ్రియన్ హోవెల్ చేసిన అధ్యయనంలో తేలింది. తన స్టడీ కోసం ఆయన కొంత మంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి కొన్ని విషయాలను గమనించారట. అందులో చాలా మంది చెప్పిన సమాధానాల్లోని కామన్ పాయింట్ ఏమంటే.. తాము ఉపయోగించే పర్‌ఫ్యుమ్ ఫ్లేవర్ ఆధారంగానే తమని ఎంతో మంది గుర్తు పెట్టుకుంటారని ఆ అమ్మాయిలు వెల్లడించారు. అందుకే వారు ఎవరికీ ఆ సుగంధ రహస్యాన్ని చెప్పడానికి ఇష్టపడరట. బాయ్‌ఫ్రెండ్ లేదా భర్తకు మాత్రం ఆ పర్‌ఫ్యూమ్‌ను ఇవ్వడానికి కారణం వారు ఆ అమ్మాయిల పక్కనే ఉంటారు కాబట్టేనట..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)