మీరు పుట్టిన డేట్ ని బట్టి.. ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసుకోండి.. విజయం మరింత ఎక్కువగా ఉంటుంది

మనందరం కెరీర్ లో సక్సెస్ అవ్వాలని, విజయం సాధించగలిగే రంగంలోనే కెరీర్ ని ఎంచుకుంటాం. మన సత్తాకి, మన తెలివితేటలకు ఫిట్ అయ్యే కెరీర్ నే ఎంచుకుంటాం. అప్పుడే.. సంతృప్తి పొందగలుగుతాం. కానీ.. చాలామంది సరైన కెరీర్ ఎంచుకోవడంలో విఫలమవుతారు. తమకు ఏమాత్రం సూటవ్వని జాబ్స్ లో చేరి.. చాలా కష్టపడుతుంటారు. చివరికి ఆ జాబ్ ని మానేస్తారు.
ఏ డేట్ లో పుట్టిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుంది ?
వాస్తు చిట్కాలు, ఇతర అంచనాలన్నింటినీ.. మరిచిపోయి.. కేవలం మీరు పుట్టిన డేట్ ద్వారా కెరీర్ కి సంబంధించిన సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా.. మీరు ఎక్కడ సక్సెస్ పొందగలుగుతారో.. తెలుసుకోండి. మీకు ఎలాంటి వర్క్ సూటవుతుందో తెలపడంలో.. పుట్టిన డేట్ చాలా అద్భుతమైనది. మరి మీరు పుట్టిన డేట్ ని బట్టి.. మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారు, ఎలాంటి జాబ్ ఎంచుకోవాలో చూద్దామా..
న్యూమరాలజీ 
న్యూమరాలజీ ప్రకారం 1 నుంచి 9 వరకు ప్రతి అంకెకు ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తిపై ప్రభావం చూపుతాయి. మీరు ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి, ఏ రంగంలో సక్సెస్ అవుతారనేది వివరిస్తుంది. అంటే 1, 10, 19, 28 పుట్టిన వాళ్ల సంఖ్య 1 అని చెబుతుంది. అంటే 1+0=1, 1+9=10(1+0=1) ఇలా చెబుతుంది.

  • 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వాళ్లు న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీలలో పుట్టిన వాళ్ల సంఖ్య 1 అవుతుంది. ఒకటి అంకెను సూర్యుడు పాలిస్తాడు. వీళ్లు పుట్టుకతోనే లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు.  పాపులర్ అయిన వ్యాపారవేత్తలు ధీరుబాయ్ అంబానీ, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ వంటి వాళ్లంతా ఈ డేట్ లలోనే పుట్టారు. వీళ్లంతా సక్సెస్ అయ్యారు. కాబట్టి.. ఈ తేదీలలో పుట్టిన వాళ్లు సక్సెస్ అవ్వాలంటే.. బిజినెస్ లేదా మీరు చేస్తున్న జాబ్ లోనే మేనేజర్ పొజిషన్ ఎంచుకోవాలి. 
  • 2, 11, 20, 29 తేదీలలో పుట్టినవాళ్లు న్యూమరాలజీ ప్రకారం ఈ డేట్ లలో పుట్టిన వాళ్ల సంఖ్య 2 అవుతుంది. 2 సంఖ్యను చంద్రుడు పాలిస్తాడు. వీళ్లు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఇలాంటి రంగంలో చాలా బాగా రాణిస్తారు. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, లియోనార్డో డి కాప్రియో వంటి ఫేమస్ వ్యక్తులు ఈ డేట్ లలోనే పుట్టి సక్సెస్ అయ్యారు. 2, 11, 20, 29 డేట్ లలో పుట్టినవాళ్లు పెయింటింగ్, ఆర్ట్, యాక్టింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాలలో రాణిస్తారు.
  • 3, 12, 21, 30లలో పుట్టినవాళ్లు న్యూమరాలజీ ప్రకారం ఈ డేట్ లలో పుట్టినవాళ్ల సంఖ్య 3. వీళ్ల వ్యక్తిత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటారు. ఈ డేట్ లలో పుట్టినవాళ్లు బ్యాంక్ లేదా ఫైనాన్స్ రంగాల్లో బాగా సక్సెస్ అవుతారు. బిజినెస్ చేయాలని ఆసక్తి ఉంటే.. రీటైల్ బిజెస్ అయితే సక్సెస్ అవుతారు. 
  • 4, 13, 22, 31 తేదీలలో పుట్టినవాళ్లు ఈ డేట్ లలో పుట్టిన వాళ్లు సంఖ్య 4. వీళ్లు చాలా విభిన్నంగా ఉంటారు. వీళ్లు రిస్క్ చేస్తుంటారు. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కొన్నిసార్లు తమను తాము సమస్యల్లో పడేసుకుంటారు. ఈ డేట్ లలో పుట్టినవాళ్లు.. ఆర్ట్, యాక్టింగ్ రంగాలను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. 
  • 5, 14, 23 తేదీలలో పుట్టినవాళ్లు ఈ డేట్ లలో పుట్టినవాళ్లకు మంచి కమ్యునికేషన్ స్కిల్స్, పవర్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉంటారు. వీళ్లు చాలా తెలివైన స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అవుతారు. మనుషులను చాలా తేలికగా కన్విన్స్ చేసే సత్తా ఉంటుంది. 5, 14, 23 తేదీలలో పుట్టినవాళ్లకు ఒకే జాబ్ లో సెటిల్ అవడం ఇష్టం ఉండదు. మారుతూ, రిస్క్ చేస్తూ ఉంటారు. టెక్నాలజీ, స్పోర్ట్స్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్ లో వీళ్లు సక్సెస్ అవుతారు.
  • 6, 15, 24 డేట్ లలో పుట్టినవాళ్లు న్యూమరాలజీ ప్రకారం ఈ డేట్ లలో పుట్టినవాళ్ల సంఖ్య 6. ఈ తేదీలలో పుట్టినవాళ్లు హోటల్, రెస్టారెంట్ లేదా లగ్జరీ ప్రొడక్ట్స్ బిజినెస్ లలో సక్సెస్ అవుతారు. అలాగే ఎంటర్ టైన్మెంట్ రంగంలో జాబ్ చేస్తే.. గ్లామర్, ఫేమ్ సంపాదిస్తారు. 
  • 7, 16, 25 డేట్ లలో పుట్టినవాళ్లు ఈ డేట్ లలో పుట్టిన వాళ్లు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. వాళ్ల తెలివితేటలు.. మంచి సక్సెస్ ని అందిస్తాయి. క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఐడియాల వల్ల వీళ్లు.. రీసెర్చ్ కి సంబంధించిన రంగంలో మంచి విజయం సాధిస్తారు.
  • 8, 17, 26 డేట్ లలో పుట్టినవాళ్లు ఈ డేట్ లలో పుట్టినవాళ్లు 35 ఏళ్ల వరకు సెటిల్ అవడానికి కష్టపడుతుంటారు. వీళ్లు చాలా ముక్కుసూటిగా ఉంటారు. అలాగే వీళ్లు చలా హార్డ్ వర్క్ చేస్తారు. సక్సెస్ అవుతారు. కానీ.. కాస్త లేటవుతుంది. 8, 17, 26 డేట్ లలో పుట్టినవాళ్లు రాజకీయాలు, హెవీ మెటల్స్ బిజినెస్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాలలో రాణిస్తారు. 
  • 9, 18, 27 తేదీలలో పుట్టినవాళ్లు స్పోర్ట్స్ లో బాగా రాణిస్తారు. ఈ డేట్ లలో పుట్టినవాళ్లు స్పోర్ట్స్ ని ఎంచుకోవచ్చు. అలాగే డిఫెన్స్ ఫోర్స్ లేదా కెమికల్ బిజినెస్ లేదా రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతారు. 
ఇప్పుడు చెప్పినట్టు ఏ డేట్ లో పుట్టిన వాళ్లు ఆ రంగంలోనే స్థిరపడాలి అని కాదు. ఈ రంగాలలో అయితే.. విజయం మరింత ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)