ఈ 5 గుర్తులు ఉంటేనే బంగారం కొనండి

బంగారం అంటే భారతీయులకు చాలా మక్కువ. పండగల సమయంలో చాలా మంది బంగారు కొనుగోళ్లు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా దీపావళి పండుగకు బంగారం కొంటారు. అయితే బంగారం కొనే ముందు జాగ్రత్తలు చాలా అవసరం. మనం ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా నాణ్యత తక్కువగా ఉన్న బంగారాన్ని అంటగట్టేస్తారు. కొనేది చిన్న ఉంగరమైనా.. పెద్ద వడ్డాణమైనా.. ఏదైనా సరే, బంగారంతో చేసిందయితే ఆ వస్తువుపై ఈ అయిదు గుర్తులు ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి. అవి ఏంటంటే..

1. బీఐఎస్ మార్క్
2. స్వచ్ఛత తెలిపే నంబర్
3. హాల్ మార్క్ సింబర్
4. తయారీ సంవత్సరం తెలిపే ఆంగ్ల అక్షరం
5. తయారీ దారుల గుర్తింపు చిహ్నం

స్వచ్ఛతలో రకాలు
999 నంబర్ ఉంటే అది స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం
958 ఉంటే – 23 క్యారెట్లు
916 – 22 క్యారెట్లు
875 – 21 క్యారెట్లు
750 – 18 క్యారెట్లు
708 – 17 క్యారెట్లు
585 – 14 క్యారెట్లు
417 – 10 క్యారెట్లు
375 – 9 క్యారెట్లు
333 – 8 క్యారెట్లు

తయారీ సంవత్సరం ఇలా..
ఆంగ్ల అక్షరం ఏ ఉంటే అది 2000 సంవత్సరానికి చెందినది. అదే ఎన్ ఉంటే 2011, పీ ఉంటే 2012.

గమనిక: బంగారం కొన్నాక క్యాష్ మెమో లేదా ఇన్‌వాయిస్‌ను అడిగిమరీ తీసుకోండి. ఏదైనా కంప్లయింట్ చేయాలంటే పనికొస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)