రక్తంలో ప్లేట్‌లెట్స్ ను పెంచే అద్భుతమైన 9 సూపర్ ఫుడ్స్

రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గకుండా, కోల్పోకుండా వాటిని వృద్ధి చేసుకోవాలంటే వీటిని తీసుకోవాలి.
  • బొప్పాయి :- బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.
  • దానిమ్మ :- ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి బాగా సహాయపడుతాయి. 
  • గ్రీన్ లీఫ్స్ :- శరీరంలో ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్(ఆకుకూరలు) తీసుకోవడం మంచిది.
  • వెల్లుల్లి :- శరీరంలో నేచురల్‌గా ప్లేట్‌లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు. 
  • బీట్ రూట్ :- ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో ఇది బాగా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ తీసుకోవాలి.
  • క్యారెట్ :- క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండుసార్లైనా తినాల్సి ఉంటుంది.
  • ఎండు ద్రాక్ష :- రుచికరమైన డ్రై ఫ్రూట్స్‌లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను నేచురల్‌గా పెంచుతుంది. 
  • ఆప్రికాట్ :- ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకు రెండుసార్లు ఆప్రికాట్‌ను తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు. 
  • ఖర్జూరం:- ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్‌గా ప్లేట్‌లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.

Popular Posts

Latest Posts