మగాళ్లు ఎట్టిపరిస్థితిలో ఆడవాళ్ళతో ఈ విషయాలు చెప్పకూడదు

జీవిత భాగస్వాముల మధ్య ఎటువంటి రహస్యాలు లేనప్పుడు బంధం కలకాలం నిలుస్తుందన్నది ఎంత వాస్తవమో అటువంటి అనుబంధాన్ని దెబ్బతీసే కొన్ని విషయాలను చెప్పకుండా ఉండడమూ అవసరమే. భాగస్వామితో అన్ని పంచుకోవాలని చెబుతుంటారు. కానీ కొన్ని సున్నితమైన టాపిక్స్ ని బయటకు చెప్పకపోవడమే మంచిది. మీ జీవితం గురించి ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు మీ భాగస్వామికి ఉందనుకోండి. కానీ కొన్ని విషయాలను పంచుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. అలాగే ఒకరిపై ఒకరికి నమ్మకం కుదరడానికి కూడా సహాయపడుతుంది. కానీ అవసరం లేకుండానే కొన్ని విషయాలను మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను పదే పదే మాట్లాడటం వల్ల మీ భాగస్వామిలో అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్ట్ నర్ తో మాట్లాడాల్సిన అవసరం లేని విషయాలేమిటో ఇప్పుడు చూద్దాం..
  • మీకు గతంలో ఉన్న ఆరోగ్య పరిస్థితుల గురించి మీ భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు.
  • జీవితంలో ఎదురైన కొన్ని నిందలను మరిచిపోవడం బెటర్. ఒకవేళ మీరు జీవితంలో అనుభవించిన ఇలాంటి ఘటనలు తెలుసుకోవాలని మీ పార్ట్ నర్ కోరితే.. అప్పుడు ఒక ఐడియా లేదా క్లూ ఇవ్వడం మంచిది. లేదంటే ఇలాంటి ఇబ్బందికరమైన ఘటనలు మళ్లీ గుర్తుచేసుకోకపోవడమే మంచిది.
  • ప్రతిరోజూ రాత్రి మీ ఊహలలో వచ్చే సెలబ్రెటీ లేదా మీ ఆఫీస్ లోని వ్యక్తి గురించి మీ భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ కలలో మరో వ్యక్తి ఊహించుకోవడం మీ భాగస్వామికి చాలా కోపం తెప్పిస్తుంది. మీ రిలేషన్ కి హాని తెస్తుంది.
  • మనలో అందరూ పర్ఫెక్ట్ కాదు. మనకు విచిత్రమైన, భయంకరమై ముద్దు పేర్లు, స్కూల్ లేదా కాలేజ్ లో కాస్త విభిన్నమైన ఇమేజ్ ఉంటుంది. వాటన్నింటినీ, ఆ స్టోరీస్ అన్నింటినీ మీ భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు.
  • అన్ని కుటుంబాల్లో గొడవలు ఉంటాయి. కానీ అలాంటివన్నీ మీ పార్ట్ నర్ కి ప్రతిరోజూ చెబితే కాస్త అసహ్యంగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.
  • మీ పెళ్లికి ముందు ఉన్న సంబంధాల గురించి చెబితే వారికి మీతో అనుబంధం పెరిగేకంటే దూరం కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. అందుకే అటువంటి విషయాలు చెప్పకూడదు.

Popular Posts

Latest Posts