సెల్‌ఫోన్ పోతే తెచ్చుకోవడం చాలా సులభం.. దానికి ఈ అవగాహన తప్పనిసరి.. సెల్‌ఫోన్ పోతే ఇలా ఫిర్యాదు చేసి తెచ్చుకోండి

నేడు ప్రతి ఒక్కరి చేతిలో కనిపించే వస్తువు సెల్‌ఫోన్‌. సెల్‌ఫోన్ల వాడకం ఏస్థాయికి చేరిందంటే ఒక పేరున్న సంస్థ సర్వే ప్రకారం భారతీయుల్లో చాలా మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ సెల్‌ఫోన్లు ఉన్నాయని తేలింది. మరుగుదొడ్డి లేని కుటుంబాల్లో సైతం సెల్‌ఫోన్‌ వాడుతున్నారని సర్వేలో గుర్తించారు. ప్రస్తుతం చిన్న, పెద్ద తేడా లేకుండా దాదాపు ప్రతిఒక్కరూ సెల్‌ఫోన్‌ను ఒక నిత్యావసర వస్తువుగా వాడుతున్నారు. ఈక్రమంలో సెల్‌ఫోన్‌ ఎక్కడైనా పోగొట్టుకుంటే దిగులు పడొద్దని బీమా కంపెనీలు భరోసా ఇస్తున్నాయి.
ఈ ఆధునికయుగంలో ప్రతిఒక్కరికీ సెల్‌ఫోన్‌ వాడకం తప్పనిసరి అయింది. ప్రస్తుతం మార్కెట్లో వందల నుంచి వేలాది రూపాయల విలువ చేసే మొబైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన సెల్‌ఫోన్‌ ఒక్క క్షణం కనిపించకుండాపోతే కంగారు పడటం సర్వసాధారణం. అందుకే ఇలాంటి సెల్‌ఫోన్ల కొనుగోలు సమయంలో బీమా చేయించుకుంటే ఎలాంటి టెన్షన్‌ ఉండదు. ఎందుకంటే సెల్‌ఫోన్‌ పొగొట్టుకుంటే బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. సెల్‌ఫోన్‌ కొనుగోలుదారుడు చెల్లించే బీమా ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఎవరికి ఫిర్యాదు చేయాలి..
సెల్‌ఫోన్‌ పోతే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. మీ సేవ కేంద్రాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పోలీసులు విచారణ చేసి మీ-సేవ కేంద్రం నుంచే బాధితుడికి సర్టిఫికెట్‌ ఇస్తారు. ఒకవేళ సెల్‌ఫోన్‌ చోరీకి గురైతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టయితే ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేస్తారు.

ఐఎంఈ నంబరు ద్వారా గుర్తింపు
మొబైల్‌ చోరీకి గురైతే ఐఎంఈ నంబరు ద్వారా గుర్తించే అవ కాశం ఉంటుంది. పోలీసులు సైబర్‌నెట్‌ ద్వారా ఈ కేసులను సులభంగా పరిష్కరిస్తారు. మొబైల్‌లో ఏదైన సిమ్‌ కార్డు వేస్తే సైబర్‌ విభాగానికి వెంటనే సమాచారం వస్తుంది. దీని ద్వారా సెల్‌ఫోన్‌ వినియోగించే వారి చిరునామా ఈజీగా గుర్తిస్తారు. సెల్‌ఫోన్‌ వినియోగించే ప్రాం తాన్ని కనిపెట్టవచ్చు. ఒకవేళ చోరీకి గురైన సెల్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ మార్పు చేసి ఇతర రాష్ర్టాలకు వెళ్లి విక్రయిస్తే కష్టమని పోలీసులు పేర్కొంటున్నారు.

పరిహారం పొందవచ్చిలా..

ఏదైనా ప్రమాదంలో సెల్‌ఫోన్‌ పాడైనా, ఎవరైనా అపహరించినా, ఎక్కడైనా పడిపోయినా బీమా చేయించి ఉంటే కొంత దీమాగా ఉండవచ్చు. ఎందుకంటే సెల్‌ఫోన్‌కు బీమా ద్వారా కొంతవరకు నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకుగాను తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కొందరు షాపు నిర్వాహకులు కొనుగోలు చేసిన ఫోన్లపై బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. రూ. 20వేల విలువైన మొబైల్‌కు ఏడాదికి రూ.150, అంతకు మించి ధరలు పలికే ఫోన్లకు రూ.300, ఆపై చిలుకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని బీమా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

బీమా వర్తింపు ఇలా..

అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయినా, ప్రయాణ సమయంలో, రోడ్డు ప్రమాదంలో పాడైపోయినా, చోరికి గురైనా బీమా వర్తింపు ఉంటుంది. వ్యక్తి అలసత్వంతో సెల్‌ఫోన్‌ మరిచిపోయినప్పుడు, సరైనకారణాలు లేకుండా, కనిపించకుండా పోయినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాడైతే బీమా వర్తించదు. అలాగే సెల్‌ఫోన్‌ మరమ్మతు చేసే సందర్భంలో పాడైతే, ఫోన్‌ సామర్ధ్యం తగ్గి పనిచేయకండా పోయినా బీమా వర్తించదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)