గర్భిణీలు ఒత్తిడికి గురైతే.. కడుపులో బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ?

  • ప్రెగ్నన్సీ అనేది అంత సులువైనది కాదు. అనేక ఛాలెంజ్ లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నన్సీ టైంలో ఒత్తిడి ఫీలవడం మామూలే. కానీ దీర్షకాలిక ఒత్తిడి.. పొట్టలోని బిడ్డపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి.. ప్రెగ్నన్సీ టైంలో ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  • ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, భయం, ఆందోళన వంటి రకరకాల ఎమోషన్స్ ప్రెగ్నన్సీ టైంలో పెరుగుతాయి. వీటన్నింటి కారణంగా ప్రెగ్నన్సీని డీల్ చేయడం కష్టంగా మారుతుంది. కానీ ఒత్తిడి అనేది ఇటు బేబీపైనా, తల్లిపైనా దుష్ర్పభావం చూపుతుంది. ఎక్కువకాలం అంటే గర్భం ధరించినప్పటి నుంచి.. బిడ్డ పుట్టేవరకు ఒత్తిడికి గురైతే.. గర్భాశయంలోని వాతావరణానికి హాని కలుగుతుంది. దీంతో.. బిడ్డ ఆరోగ్యం, బిడ్డకు సంబంధించిన కొన్ని విషయాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి ప్రెగ్నన్సీ టైంలో ఒత్తిడికి లోనైతే.. ఎలాంటి దుష్ర్పభావాలు కలుగుతాయో తెలుసుకుందాం..
  • ముందుగానే పుట్టడం గర్భదారణ సమయంలో ఎక్కువగా ఒత్తిడికి గురైతే..ప్రధానంగా ఎదురయ్యే సమస్య ప్రీ టర్మ్ బర్త్. గర్భిణీలు దీర్ణకాలంగా ఒత్తిడికి గురవడం వల్ల.. డెలివరీ కంటే ముందే పిల్లలు పుట్టే ముప్పు పెరుగుతుంది.
  • నిద్రలో సమస్యలు ప్రెగ్నన్సీ టైంలో దీర్షకాలిక ఒత్తిడికి గురయ్యే తల్లులకు పుట్టిన పిల్లలు నిద్రలో సమస్యలను ఎదుర్కొంటారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. స్లీప్ డిజార్డర్స్ సమస్య ఇలాంటి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందట.
  • తక్కువ బరువు ప్రెగ్నన్సీ టైంలో ఎక్కువగా ఒత్తిడికి గురైతే.. పిల్లలపై చాలా దుష్ర్పభావం పడుతుంది. అందులో లో బర్త్ వెయిట్ ఒకటి. పిల్లలు పుట్టినప్పుడు ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు.
  • బ్రెయిన్ డెవలప్ మెంట్ బేబీ పొట్టలో ఉన్నప్పుడు తల్లి ఏం చేసినా.. అది బేబీపై ప్రభావం ఉంటుంది. అలాగే బేబీ పొట్టలో ఉన్నప్పుడు తల్లి ఎక్కువగా ఒత్తిడికి గురైతే.. వాళ్ల మెదడుపై దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి.. ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.
  • ప్రవర్తన సమస్యలు తల్లి ఎక్కువగా ఒత్తిడికి గురవడం వల్ల పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యేకొద్దీ వాళ్లలో ప్రవర్తన సంబంధించిన పలు సమస్యలు ఎదురవుతాయట. కాబట్టి.. ప్రెగ్నన్సీ టైంలో చాలా వరకు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం న్యాచురల్ టిప్స్ ఫాలో అవడం మంచిది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)