అలాంటి జీవిత భాగస్వాములు దొరికితే మీ జీవితం సూపర్ !

ఈరోజుల్లో పెళ్ళి జరిగేంత వరకు సింగల్ గా ఉండటం కష్టం. అమ్మయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, టీనేజ్ లోనో, కాలేజ్ లోనో, ఆఫీసులోనో, ఒకరిద్దరితోనైనా ప్రేమలో పడిపోతున్నారు. కొందరైతే అడుగు ముందుకేసి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నారు. కొన్ని ప్రేమకథలు మాత్రమే పెళ్ళిపీటల వరకు వెళుతుంటాయి. ఇక జనాభాలో మరోవర్గం కూడా ఉంది. అదే సింగల్ జనాభా. వీరికి పెళ్ళి జరిగితే తప్ప ఓ భాగస్వామి దొరకదు/దొరకడు. వారికి పెళ్ళి అనేది చాలా పవిత్రం. అప్పటివరకు తెలియని వ్యక్తిని ప్రేమగా చూసుకోవడం, మానసికంగా, శారీరకంగా కలవడం.. అంతా కొత్త. కాని ఇలాంటివారు మంచి జీవితభాగస్వాములు అయ్యే అవకాశం చాలా ఎక్కువ అని అంటున్నారు. మానసిక నిపుణులు. ఎందుకో తెలుసా..
  • భర్తతో భార్య, భార్యతో భర్త ప్రేమలో పడితే, వారికి అదే మొదటి లవ్ స్టోరి అవుతుంది. మొదటి ప్రేమ ఎంత మధురంగా, ఎంత నిర్మలంగా ఉంటుందో మనకు తెలిసిందే. జీవిత భాగస్వామే మన తొలి ప్రేమ అయితే ఈ జీవితానికి ఇంకేం కావాలి. 
  • సింగల్ ఉన్నవారు రిలేషన్ షిప్ లోకి వస్తే, వారితో వీరితో పోల్చే గొడవలు ఉండవు. తమ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో, లేదా బాయ్ ఫ్రెండ్ తో మిమ్మల్ని పోల్చి ఇబ్బంది పెట్టె సమస్యే ఉండదు. 
  • అప్పటివరకు ఒక బయటి వ్యక్తి నుంచి ప్రేమను పొందలేదు కాబాట్టి, మీరు కాకపోతే ఇంకొకరు అనే ఆలోచన రాకపోవచ్చు. మిమ్మల్ని అస్సలు పోగొట్టుకోకూడదు అనే ఆలోచనే వారికి మీపై మరింత ఇష్టం కలిగేలా చేస్తుంది. 
  • సింగల్ గా ఉండి రిలేషన్ లిప్ లోకి వచ్చిన వారు, తమ బంధంలో నటించే అవకాశం తక్కువ. ఈ మెంటల్ అనాలసిస్, మూడ్ స్వింగ్స్ కి భయపడటం లాంటి జరగకపోవచ్చు. మనసులో ఏమనిపిస్తే అది బయటపెట్టేస్తారు. దాచుకున్న అబద్ధం కన్నా, నిజం చెప్పి సమస్యపై మాట్లాడటం బెటర్ కదా. 
  • భార్య లేదా భర్త తొలి ప్రేమైతే, వారికిచ్చే గౌరవం, ప్రాముఖ్యత వేరేగా ఉంటుంది. కాని ఆ ప్రేమ భాగస్వాముల మధ్య పుడితేనే అది సాధ్యం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)