పాలు తాగడం కంటే బీరు తాగడమే ఆరోగ్యానికి మంచిదట

చాలా వరకు పాలు ఆరోగ్యాన్ని పెంచుతాయి అని, పాలతో మంచి పోషకాలు లభిస్తాయి అని మనం చదువుకున్నాం. కానీ పాలు తాగడం వల్ల ఉపయోగం ఏమి లేదని, బీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని 2000 సంవత్సరంలో పెటా' (జంతు సంరక్షణ సంస్థ) ప్రకటించింది. అంతే కాక పాల కోసం లక్షలాది ఆవులను ఇబ్బంది పెడుతున్నారని పాల వినియోగం తగ్గించాలని పాల కంటే బీరు తాగడం మంచిదని ప్రచారం చేసింది. ఈ ప్రచారానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది.

ఇప్పుడు మళ్ళీ అదే సంస్థ మళ్ళీ అదే ప్రకటనను సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందని అంటుంది. పాలను గాని పాల ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఎముకలు సన్నగిల్లే ప్రమాదం ఉందని దీనితో పాటు డయాబెటిస్, ఒబేసిటీ, కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. అయితే బీరు తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని ఎముకల పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఆయుష్షును కూడా పెంచుతుందని తెలిపింది. అయితే అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ మాడిసన్ క్యాంపస్ కు దగ్గర్లో 'గాట్ బీర్' పేరుతో ఓ బిల్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. పాలు తాగడం కంటే బీరు తాగడమే ఆరోగ్యానికి మంచిదనే విషయం సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందని బిల్ బోర్డుపై పేర్కొంది. అందుకే , 'ఇట్ ఈజ్ అఫీషియల్' అంటూ బీరుకు ప్రచారం చేసింది పెటా. ఆల్కహాల్ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదేనని పెటా ఉపాధ్యక్షుడు ట్రేసీ రీమన్ చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)