పాన్ కార్డు గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవలసిన 6 ముఖ్య విషయాలు

 • ఆదాయ‌పు ప‌న్ను శాఖ ప్ర‌తి ఒక్క‌రికీ కేటాయించే శాశ్వ‌త ఖాతా సంఖ్య‌ను పాన్(ప‌ర్మినెంట్ అకౌంట్ నంబ‌రు) అంటారు. అంకెలు, అక్ష‌రాలు క‌ల‌గ‌లిపి ఉండే ప‌ది స్థానాల సంఖ్య ఇది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు, ఆ శాఖ‌కు చెందిన ఏ అధికారితోనైనా జ‌రిపే ఉత్త‌ర ప్ర‌త్యుత్తరాల‌లో పాన్‌ను పేర్కొన‌డం త‌ప్ప‌నిసరి. అయినా స‌రే చాలా మంది పాన్ కార్డు తీసుకోకుండా ఇబ్బందులు ప‌డుతుంటారు. మ‌రికొంత మంది ఎక్క‌డ పాన్ కార్డు నంబ‌రు ఇవ్వాలి, ఎక్క‌డ వ‌ద్దు అనే విష‌యంలో తిక‌మ‌క ప‌డుతూ ఉంటారు. ఈ క్ర‌మంలో పాన్ కార్డును గురించిన 6 ముఖ్య విష‌యాల‌ను తెలుసుకుందాం.
 • పాన్ కార్డు ఎప్పుడు అవ‌స‌రం?  రూ. 50 వేల పైబ‌డి బ్యాంకు డిపాజిట్ల కోసం * బ్యాంకు ఖాతా తెరిచేందుకు * డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెర‌వ‌డానికి * చెక్కులు, డీడీల విష‌యంలో లావాదేవీ రూ. 50 వేల‌ను మించితే * స్థిరాస్తి, వాహ‌నాల కొనుగోలు, అమ్మ‌కాలు జ‌రిపేటప్పుడు * హోట‌ళ్లు, విలాసాలు, ప్ర‌యాణ ఖ‌ర్చులు వంటి వాటి కోసం రూ. 25 వేల కంటే న‌గ‌దు చెల్లింపులు చేసే విష‌యంలో * ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేట‌ప్పుడు.
 • ఎవ‌రెవ‌రికి త‌ప్ప‌నిస‌రిగా పాన్ ఉండాలి?  
 • ప్ర‌స్తుతం ఆదాయం ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన వారికి, చెల్లించేవారంద‌రికీ, ఇత‌రుల త‌ర‌పున ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖాలు చేయాల్సిన వారికి * విధిగా పాన్ నంబ‌రు న‌మోదు చేయాల్సిన లావాదేవీల‌లో కొత్త‌గా ప్ర‌వేశించాల‌నుకునే వారికి
 • పాన్ కోసం ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు చేయాలి ? 
 • పాన్‌కు సంబంధించిన సేవ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం కోసం, ఆదాయ‌పు ప‌న్ను శాఖ కార్యాల‌యం ఉన్న ప్ర‌తి ప‌ట్ట‌ణంలో ఐటీ పాన్ సేవా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డానికి యుటిఐ ఇన్వెస్ట‌ర్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌(యుటిఐఐఎస్ఎల్‌) సంస్థ‌కు ఆ శాఖ అనుమ‌తించింది. పెద్ద న‌గ‌రాల‌లో పాన్ ద‌ర‌ఖాస్తుదారుల సౌక‌ర్యాల కోసం, యుటిఐఐఎస్ఎల్ ఒక‌టి కంటే ఎక్కువ ఐటీ పాన్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. వీటితో పాటు టిన్ ఫెసిలిటేష‌న్ కేంద్రాలు కూడా ఉంటాయి. వీట‌న్నింటిలో పాన్ ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.
 • పాన్ కోసం అవ‌స‌ర‌మ‌య్యేవి 
 • ఒక పాస్‌పోర్టు సైజ్ క‌ల‌ర్ ఫోటో
 • రూ.107 డిమాండ్ డ్రాఫ్ట్ 
 • వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌ 
 • చిరునామా గుర్తింపు ప‌త్రం జిరాక్స్‌
 • వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం 
 • స్కూల్ లీవింగ్ స‌ర్టిఫికెట్‌(టీసీ)
 • ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా 
 • గుర్తింపు పొందిన విద్యా సంస్థ‌ల డిగ్రీ మార్కుల జాబితా 
 • డిపాజిట‌రీ ఖాతా స్టేట్‌మెంట్ 
 • క్రెడిట్‌కార్డు స్టేట్‌మెంట్ 
 • బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్ 
 • నీటి బిల్లు(వాట‌ర్ బిల్లు) 
 • రేష‌న్ కార్డు 
 • ప్రాప‌ర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డ‌ర్‌ 
 • పాస్‌పోర్టు 
 • ఓట‌రు గుర్తింపు ప‌త్రం 
 • డ్రైవింగ్ లెసెన్సు 
 • ఎంఎల్ఏ లేదా ఎంపీ లేదా మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ లేదా గెజిడెడ్ ఆఫీస‌ర్ సంత‌కం చేసి ఇచ్చే గుర్తింపు రుజువు
 • చిరునామా గుర్తింపు కోసం 
 • విద్యుత్ బిల్లు 
 • టెలిఫోన్ బిల్లు 
 • డిపాజిట‌రీ ఖాతా స్టేట్‌మెంట్ 
 • క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ 
 • బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్‌ 
 • రెంట్ రిసిప్ట్‌(అద్దె చెల్లించిన ర‌సీదు) 
 • ఎంప్లాయిర్ స‌ర్టిఫికెట్ 
 • పాస్‌పోర్టు 
 • ఓట‌రు గుర్తింపు ప‌త్రం 
 • ప్రాప‌ర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డ‌ర్‌ 
 • డ్రైవింగ్ లైసెన్స్‌ 
 • రేష‌న్ కార్డు 
 • ఎంఎల్ఏ లేదా ఎంపీ లేదా మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ లేదా గెజిడెడ్ ఆఫీస‌ర్ సంత‌కం చేసి ఇచ్చే గుర్తింపు రుజువు
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)