ఏ బ్యాంకు అకౌంట్ అయినా హ్యాక్ చేయడం ఇంత ఈజీనా...

టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో డబ్బు సంపాదిస్తున్న వారందరు బ్యాంక్ ఎకౌంట్ వాడడం సర్వ సాధారణం. మరి టెక్నాలజీ అప్ గ్రేడ్ అయ్యింది కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉపయోగించుకుంటారు. ఇది సురక్షితం అని మనకు తెలిసినా హ్యాకర్లు ఊరుకుంటారా చెప్పండి. ఎప్పుడెప్పుడు ఎవరి డబ్బు నోక్కేయాల అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇది తప్ప ఇంకో పనేముంటుంది. కాబట్టి ఇప్పుడు మీ బ్యాంక్ ఎకౌంట్ హ్యాక్ చేయడం ఎంత సులభమో తెలుసుకొని జాగ్రత్త పడండి.
ఈ కాలంలో సోషల్ మీడియా ఎకౌంట్ లేని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా మీ బ్యాంక్ ఎకౌంట్ నుండి డబ్బుని ఎలా దోచేస్తారో ఇప్పుడు చూద్దాం..!!
  • సోషల్ మీడియా ఎకౌంట్ నుండి మీ పేరు మరియు పుట్టిన తేది తెలుసుకుంటారు.
  • ఈ వివరాలతో ఇన్కమ్ టాక్స్ వెబ్ సైట్ కి వెళ్లి.. అక్కడినుండి మీ పాన్ కార్డు మరియు ఫోన్ నెంబర్ తెలుసుకుంటాడు.
  • ఆ తర్వాత దులికాతే పాన్ కార్డు చేయిస్తాడు.
  • తర్వాత ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.
  • పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన FIR సహకారంతో కొత్త SIM కి అప్లై చేస్తాడు.
  • ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని ఉపయోగించడం సులభమవుతుంది.
  • ఇక్కడ ఫర్గాట్ పాస్ వర్డ్ (forgot password) ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటాడు.
  • ఎలాగో కొత్త SIM హ్యాకర్ వద్దనే ఉంది కాబట్టి అతని ఫోన్ కి కొత్త పాస్ వర్డ్ వస్తుంది.
  • దీంతో మీ బ్యాంక్ ఎకౌంట్ లో ఉన్న డబ్బుని మింగేస్తాడు.
ఈ సమాచారాన్ని సైబర్ సెల్ పోలీస్ వారు అందించారు. దయచేసి ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి. ఇలాంటి హ్యాకర్ల బారిన పడకుండా మీ బంధుమిత్రులను కాపాడండి..!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)