మన ఇండియన్స్ గురించి వేరే దేశస్తులు ఏమనుకుంటారో తెలుసా ? తెలిస్తే నవ్వుకుంటారు

Loading...
 • భారత దేశం యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది కేవలం మన దేశస్తులు అంటున్న మాట కాదు... విదేశాల నుండి ఎందరో ప్రముఖులు మన దేశానికి వచ్చి.. వారంతట వారు మన దేశ గొప్పతనాన్ని తెలుసుకొని చెప్పిన విషయం ఇది. సాధారణంగా ఏ దేశం గురించైనా తెలుసుకోవాలనుకుంటే పుస్తకాల్లోనో లేక ఇంటర్నెట్ లోనో చదివి తెలుసుకుంటాం. మహా అయితే సినిమాల్లో చూసి తెలుసుకుంటాం. అలాగే మన దేశం గురించి, మన గురించి విదేశీయులకు కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు వింటే మీకు కూడా నవ్వొస్తుంది...!! అవేంటో చూడండి...
 • భారతీయులంతా స్పైసి ఫుడ్ తింటారని అనుకుంటారు. కానీ వాస్తవానికి మనలో చాలా మంది స్పైసి ఫుడ్ తినలేకపోతారు. కొందరికైతే కొంచెం కారం తగలగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.
 • మన దేశంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే కట్నం తప్పని సరి అనుకుంటారు. కాని వాస్తవానికి.. ఈ రూల్ కొంతమందికే చెందుతుంది. ఉత్తర భారత్ లోని ఎన్నో రాష్ట్రాల్లో కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకుంటారు.
 • మన దేశంలో ఉన్న అందరికి సినిమా పిచ్చి ఉందనుకుంటారు. కాని వాస్తవానికి సినిమాని ఇష్టపడని వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు సినిమాలు చూసి సమయాన్ని వృధా చేయకుండా.. డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు.
 • మన దేశంలో అన్ని ఇళ్ళల్లో కనీసం 10 మంది ఉంటారని అనుకుంటారు. ఇలా అన్ని కుటుంబాలు కలిసి ఉంటాయనేది కేవలం అపోహ మాత్రమే. ఇలాంటి కుటుంబాలు సినిమాలు, సీరియల్స్ కే పరిమితం.
 • దక్షిణ భారత దేశంలో ఉన్న మొగవారందరు లుంగీలు ధరిస్తారని అనుకుంటారు. అలాగే ఆడవారు కేవలం చీరలు మాత్రమే ధరిస్తారని అనుకుంటారు. కాని ఇక్కడంత సీను లేదు. ఇప్పట్లో మాత్రం అల్ట్రా మోడరన్ గా తయారయ్యే వారే ఎక్కువ.
 • భారతీయులు నాన్ వెజ్ ఎక్కువగా తినరని అనుకుంటారు. కాని వాస్తవానికి మన దేశంలో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంతెందుకు 2012 లో అత్యధికంగా బీఫ్ ని ఎగుమతి చేసిన దేశంగా నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.
 • మన దేశంలో క్రికెట్ ని ఓ రిలీజియన్ గా భావిస్తారనడం వాస్తవమే. దీని అర్ధం అందరు క్రికెట్ అంటే ఇష్టపడతారని కాదు...! క్రికెట్ అంటే ఇష్టం లేని వారు కూడా ఉన్నారు.
 • భారత దేశంలో చదువుకున్న వారందరు IT ప్రొఫెషనల్స్ అనుకుంటారు. కాని వాస్తవానికి మన దేశంలో IT ప్రొఫెషనల్స్ గా పనిచేస్తున్నది కేవలం 27 లక్షల మందే.
 • ఇక్కడ అమ్మాయిలకు స్వేచ్చ ఉండదని అనుకుంటారు. అవన్నీ ఒకప్పటి రోజులు.. ఈ రోజుల్లో రాత్రి ఒంటి గంటకు పబ్ లో డాన్స్ చేసే అమ్మాయిలు కూడా కనిపిస్తారు. ఎవరి ఫ్రీడమ్ వారికి ఉంటుంది.
 • మన దేశంలో గల్లికొక రేపిస్ట్ ఉంటాడని అనుకుంటారు. ఇలా అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు... ఎందుకంటే రేప్ గురించి మన దేశంలో వస్తున్న వార్తలు, అవేర్నెస్ యాడ్ లే ఇందుకు కారణం. ఇలాంటి విషయాల పై అవగాహన కలిపించడానికి అవేర్నెస్ యాడ్ లు చేయక తప్పదు మరి.
 • భారత దేశంలో అందరు సినిమా హీరోలనే ఫాలో అవుతారని అనుకుంటారు. నిజానికి ఏ హీరోకైనా పెద్ద ఫ్యాన్ అయితే.. ఆ హీరో సినిమా చూసే రోజు మాత్రమే ఆ హీరోలా రెడీ అయ్యి సినిమాకి వెళ్తారు. మిగితా సమయంలో ఎవరి పని వారిదే.
 • మన దేశం చాలా వేడిగా ఉంటుందని అనుకుంటారు. కాని ఇక్కడ అన్ని వాతావరణాలు ఉంటాయి. చలి కాలంలో మంచుతో నిండిపోయిన రోడ్లను చూస్తే అర్ధమవుతుంది.
 • ఎక్కువ శాతం భారతీయులకు అసలు ఇంగ్లీష్ మాట్లాడడం రాదనుకుంటారు. కాని నిజానికి ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు ఎక్కువ శాతం ఉన్నది మన దేశంలోనే.
Loading...

Popular Posts