పర్యావరణ పరిరక్షణ కోసం శరీరంపై నూలుపోగు లేకుండా సైకిల్ ర్యాలీ

మీనాల్ జైన్.. ఈ పేరు భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు పరిచయం లేకపోవచ్చు. కానీ, లండన్ ప్రజలకు, అక్కడి భారతీయులకు మాత్రం సుపరిచితం. దీనంతటికీ కారణం ఆమె చేసిన పనులే. ఆ పనుల గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవడం ఖాయం. మీనాల్ జైన్ లండన్‌లో నివాసం ఉండే భారతీయ మహిళ. అక్కడ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని. ఈ రోజుల్లో నగ్నత్వం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నగ్నత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈమె దీనికి పూర్తి వ్యతిరేకం. నగ్నంగా సైకిల్ ర్యాలీ చేయడం ఈమె ప్రత్యేకత. మానవత్వం, పర్యావరణ పరిరక్షణకు మీనాల్ జైన్ నగ్నంగా లండన్‌లో సైకిల్ ర్యాలీ నిర్వహించింది. మనం పుట్టినప్పుడు శరీరంపై నూలుపోగు లేకుండా పుట్టామని, చనిపోయినప్పుడు కూడా అలాగే పారేస్తారని అటువంటప్పుడు మధ్యలో ఈ దుస్తులు ఇవన్నీ ఎందుకని నగ్నత్వ ప్రచారాన్ని మీనాల్ సమర్థించుకుంటుంది. ఇప్పటికే అనేకసార్లు బీచ్‌లలో నగ్నంగా తిరిగిన మీనాల్ ఒక బ్లాగ్ సైతం ఏర్పాటు చేసి నగ్నత్వం గురించి ప్రచారం మొదలు పెట్టింది. అంతేకాకుండా మెల్‌బోర్న్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన నగ్న ర్యాలీలో శరీరంపై నూలుపోగు లేకుండా సైకిల్ ర్యాలీ నిర్వహించి ఆ ఫీట్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. పర్యావరణ పరిరక్షణ కోసం నగ్న ర్యాలీ అవసరమా ?????/
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)