విదేశీయులు ఇండియ‌న్స్ చూసి నేర్చుకున్న 8 అల‌వాట్లు...

టీ  లేదా కాఫీని సాస‌ర్‌లో తాగ‌డం
వేడి వేడి చాయ్ లేదా కాఫీని క‌ప్పులో అందిస్తే దాన్ని తాగేందుకు చాలా మంది సంశ‌యిస్తుంటారు. ఎక్క‌డ మూతి కాలుతుందో అన్న భ‌యం. అయితే మ‌న ఇండియన్స్ అలా కాదుగా. చాయ్ లేదా కాఫీ ఏదైనా వేడిగా ఉంటే దాన్ని సాస‌ర్‌లో పోసుకుని చ‌ల్ల‌గా చేసుకుని వెంట‌నే జుర్రుమ‌ని తాగేస్తారు. ఇదే అల‌వాటును కొంద‌రు ఫారిన‌ర్స్ కూడా నేర్చుకుని మ‌రీ పాటిస్తున్నారు.
భోజ‌నాన్ని చేత్తో తిన‌డం
మ‌న దేశంలో త‌ప్ప ఎవ‌రూ భోజ‌నాన్ని చేతుల్తో చేయ‌రు. చెంచా లేదంటే ఫోర్క్‌ల‌ను వాడుతారు. అయితే కొంద‌రు విదేశీయులు మాత్రం మ‌న ద‌గ్గ‌ర మ‌నం చేతుల్తో చేసే భోజ‌నాన్నే వారు కూడా ఫాలో అవుతున్నారు. చెంచా, ఫోర్క్‌ల‌కు బ‌దులుగా మ‌నం తిన్న‌ట్టు వారు కూడా చేతుల్తోనే తింటున్నారు. ఇది కూడా వారు మ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్న అల‌వాటే.
ఇంటి బ‌య‌టే చెప్పులు వ‌దిలేయడం
మ‌న ద‌గ్గ‌రైతే ఎవ‌రి ఇంటికైనా వెళ్తే చెప్పుల‌ను బ‌య‌టే వ‌దుల్తాం. కానీ ఫారిన్‌లో అలా కాదు. ఇంట్లోకి నేరుగా చెప్పులు, షూస్ వేసుకుని వెళ్తారు. అయితే కొంద‌రు విదేశీయులైతే మ‌న అల‌వాటును పాటిస్తున్నారు. చెప్పులు, షూస్ వంటి వాటిని బ‌య‌టే వ‌దిలేసి ఇత‌రుల ఇండ్ల‌లోకి వెళ్తున్నారు. దీని గురించి వారు మ‌న ద‌గ్గ‌రే నేర్చుకున్నారు.
ఇండియ‌న్ టాయిలెట్స్‌
వెస్ట‌ర్న్ టాయిలెట్స్ అయితే చెయిర్‌లో కూర్చున్న‌ట్టుగా ఉంటాయి. ఆ భంగిమ‌లో విరేచ‌నం సాఫీగా అవ‌దు. ఇండియ‌న్ స్టైల్‌లో కూర్చుంటేనే విరేచ‌నం సుల‌భంగా అవుతుంది. అందుకే చాలా మంది విదేశీయులు మ‌న అల‌వాటును పాటిస్తూ ఇప్ప‌టికీ ఇండియ‌న్ స్టైల్ టాయిలెట్స్‌ను వాడుతున్నారు.
త‌ల ఊపుతూ స‌మాధానం చెప్ప‌డం
మ‌న ద‌గ్గ‌ర్నుంచి విదేశీయులు చేసుకున్న అల‌వాట్ల‌లో ఇది కూడా ఒకటి. అదేమిటంటే… ఎవ‌రైనా ఏదైనా అడిగితే అందుకు మ‌నం త‌ల అటు, ఇటు ఊపుతూ స‌మాధానం చెబుతాం క‌దా. అదే ప‌ద్ధ‌తిలో కొంద‌రు విదేశీయులు స‌మాధానం చెప్ప‌డం అల‌వాటు చేసుకున్నార‌ట‌. వారు మ‌న నుంచి తీసుకున్న అల‌వాటులో ఇది కూడా ఒక‌టి.
రంగు రంగుల దుస్తులు ధ‌రించ‌డం
మ‌న ద‌గ్గ‌ర పండ‌గైనా, ప‌బ్బ‌మైనా రంగు రంగుల దుస్తుల‌ను ధ‌రిస్తాం. కానీ విదేశాల్లో అలా కాదు. ఎల్ల‌ప్పుడూ, ఏ సంద‌ర్భ‌మైనా వారు న‌లుపు రంగు దుస్తుల‌నే ఎక్కువ‌గా వేసుకుంటారు. అయితే కొంద‌రు ఫారిన‌ర్స్ మాత్రం మ‌న‌లాగే శుభ కార్యాలు ఉన్న‌ప్పుడు రంగు రంగుల దుస్తుల‌ను వేసుకోవ‌డం అల‌వాటు చేసుకుని అదే పాటిస్తున్నారు.
జుగాద్ టాలెంట్
ప్ర‌త్యామ్నాయ అవ‌స‌రాల కోసం ఏ వ‌స్తువును ప‌డితే ఆ వ‌స్తువును మార్పులు చేర్పులు చేసి మ‌న ద‌గ్గర అనేక మంది వాటిని వివిధ ర‌కాల ప‌నుల‌కు వాడుకుంటూ ఉంటారు క‌దా. ఈ క్ర‌మంలో కొంద‌రు కొన్ని వ‌స్తువుల‌ను వింత‌గా త‌యారు చేసి ఉప‌యోగిస్తుంటారు కూడా. వాటినే హిందీలో జుగాద్ అని అంటాం. అయితే ఈ జుగాద్ టాలెంట్‌ను కూడా కొంద‌రు విదేశీయులు వంట‌బ‌ట్టించుకున్నారు. వారు కూడా ఇదే ప‌ద్ధ‌తిలో త‌మ ఇంట్లో ఉన్న ఆయా వ‌స్తువుల‌ను మోడిఫై చేసి మ‌రీ వాడుకుంటున్నారు.
అయ్యో..! అచ్చా..! 
నార్త్ ఇండియాలో అయితే అచ్చా అనే ప‌దం, సౌత్ ఇండియాలో అయితే అయ్యో అనే ప‌దం మ‌న ద‌గ్గ‌ర ఫేమ‌స్‌. ఈ రెండు ప‌దాల‌ను మ‌న‌వారు ఎక్కువ‌గా ఆయా సంద‌ర్భాల్లో వాడుతుంటారు. అయితే కొంత మంది ఫారినర్లు కూడా ఇవే ప‌దాల‌ను మాట్లాడ‌డం అల‌వాటు చేసుకున్నారు. వారు ఈ ఐడియాను మ‌న ద‌గ్గ‌రి నుంచే తీసుకున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండు ప‌దాల‌ను వాడ‌డం ఇప్పుడు విదేశాల్లోనూ కామ‌న్ అయిపోయింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)