నడవలేని చిన్నారులను ఉచిత చికిత్స చేసి నడిపిస్తున్న దేవాలయాలు ఆ ఆసుపత్రులు

తమకు పుట్టబోయే బిడ్డలు అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లీతండ్రీ ఆశిస్తాడు. దేవతలందరికీ మ్రొక్కుతారు. కానీ జన్యులోపాల వల్లగానీ , గర్భంలో ఉన్నప్పుడు వాడకూడని టాబ్లెట్స్ వాడటం వల్లగానీ మరియు ఇతర కారణాల వల్లగానీ పుట్టే పిల్లల్లో లోపాలు ఉంటున్నాయి.

ప్రాణంతో పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 64.3 మందికి లోపాలు ఉంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 33మంది పిల్లల్లో ఒకరికి అవకరం ఉంటోంది.
అంటే ప్రతి నాలుగున్నర నిమిషాలకి ఒక శిశువు లోపంతో పుడుతోంది.
మన దేశంలో సంవత్సరానికి 7,700 మంది నవజాత శిశువులు పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల మరణిస్తున్నారు. ప్రతి ఐదు శిశు మరణాల్లో ఒకటి అవకరాల వల్ల ఉంటోంది.

అలా లోపాలతో పుట్టే పిల్లల్లో క్లబ్ పుట్ పిల్లలు కూడా ఉంటారు.
ఇక్కడున్న ఫోటోలలో చూస్తున్నట్లుగా పాదాలు వంపు తిరిగి ఉన్నట్లయితే ,
వాటిని “ క్లబ్ ఫుట్ “ అంటారు.

అటువంటి పాదాలు ఉన్న చిన్నారులు చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారు.
వారి తల్లిదండ్రుల గుండెల్లో ఎంతో బాధ ఉంటుంది.
అలాంటి చిన్నారుల పాదాలను సరిచేసి ,
మిగతా వారిలాగే నడిచేంత వరకు ప్రత్యేక బూట్లను ఇచ్చి ,
పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం అందించే ఆసుపత్రుల వివరాలు ఇవి.

ఎవరికైనా తప్పకుండా ఉపయోగపడవచ్చు.
కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)