ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... మెదడు , నరాలకు సంబంధించిన అన్ని జబ్బులకూ ఫ్రీ ట్రీట్ మెంట్

నరాలకు సంబంధించిన ఏ జబ్బు వచ్చినా కూడా ఆ వ్యక్తి జీవన విధానం పూర్తిగా తారుమారు అవుతుంది. కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోతుంది. వైద్య ఖర్చులతో సంసారం చిన్నాభిన్నమవుతుంది.

అదే విధంగా మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తే ,
వాటికి ట్రీట్ మెంట్ చేయించుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది.

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండే పేదలకు అది ఏమాత్రం సాధ్యం కాదు.
అందుకే వాళ్ళు ఆ జబ్బులతో బాధపడుతూనే బ్రతుకును వెళ్ళదీస్తుంటారు.

కానీ నిరుపేదలు ఇప్పుడు ఏమాత్రం భయపడాల్సిన అక్కరలేదు. బాధ పడాల్సిన పనిలేదు.

ఎందుకంటే , మెదడు , నరాలకు సంబంధించిన ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా ,
ఎన్ని లక్షలు ఖర్చు అయ్యేది అయినా కూడా పూర్తి ఉచితంగా చేసే ఆసుపత్రి ఒకటి ఉంది.

అక్కడికి వెళ్ళాలనుకుంటే ………. మీరు చేయవలసిందంతా ఒక్కటే………….

గతంలో మీరు ఇతర ఆసుపత్రులలో ఏమైనా టెస్టింగులు చేయించుకుని ఉంటే ,
ఆ రిపోర్ట్ పత్రాలను తీసుకువెళ్ళండి.

అదే విధంగా మీయొక్క ఆధార్ కార్డు గానీ , ఓటర్ కార్డు గానీ లేదా రేషన్ కార్డు గానీ తీసుకొని వెళ్ళండి.

పైన పేర్కొన్న వాటిని తీసుకొని ,
ఉదయం ఆరు గంటల కల్లా క్యూ లో ఉంటే 7 గంటల నుండి ఓ.పి. టోకెన్లు ఇస్తారు.
తర్వాత 8 గంటల నుండి వైద్యులు పేషంట్లను చూస్తారు.

ప్రపంచ స్థాయి కార్పోరేట్ వైద్యం అందించే ఈ ఆసుపత్రిలో
మెదడు , నరాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆసుపత్రిలో తీసుకోరు.
అంతా ఫ్రీ………ఫ్రీ…………ఫ్రీ…………..

ఆసుపత్రి వివరాలు ఏమిటంటే……………

శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
వైట్ ఫీల్డ్ , బెంగుళూరు.

బెంగుళూరు బస్టాండ్ నుండి , రైల్వే స్టేషన్ నుండి సిటీ బస్సులు మరియు ఆటోల సౌకర్యం ఉంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)