దూడ ఆకలి తీర్చడం కోసం ప్రాణం పోతున్నా లెక్కచెయ్యని ఆవు... ఎంతైనా అమ్మంటే అమ్మే.. ఈ సన్నివేశం చూసిన వారి కంట కన్నీరు

అమ్మ అనే మాటలోనే ఓ కమ్మదనం.. వండిన వంట ముగ్గురికి వస్తుందని తెలిసి.. నలుగురికి ఉందని చెప్పి తన కుటుంబంలో అందరికీ పెట్టి తాను మంచి నీరు తాగి పడుకొనే అమృత హృదయం అమ్మకే సొంతం.. కాగా మాతృత్వానికి మనిషి జంతువు అనే తేడా లేదు.. పశుపక్ష్యాదులు కూడా తమ పిల్లల కోసం వాటి ఆకలిని తీర్చడం కోసం అలమటించిపోతాయి.. అటువంటి మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.. ఈ గోమాత.. నల్లమందు తూటా పేలి తను తీవ్రంగా గాయపడినా ఆ గాయాన్ని లెక్కచేయ్యకుండా.. 3 కిలో మీటర్లు నడిచి ఇంటికి చేరుకొని తన దూడకు పాలిచ్చింది.. ఈ సన్నివేశం చూసిన వారి కంట కన్నీరు నిలిచింది.. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే...
అంతరపురం జిల్లా బాలంపల్లికి చెందిన అశ్వర్ధరెడ్డి అనే వ్యక్తి ఆవు ఆ గ్రామ సమీపంలోని కొండ వద్దకు మేతకు వెళ్లింది. అక్కడ అడవి పందులను చంపడానికి గడ్డిలో ఉంచిన నల్లమందు తూటా పేలి దాని దవడకు తీవ్ర గాయమైంది. రక్తస్రావంతో అక్కడే పడిపోయిన ఆవు కొద్ది సేపటికి లేచి పరిగెత్తుకుంటూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి చేరుకొని తన దూడకు పాలిచ్చింది. ఆవుని పశువైద్యడుకి చూపించగా బతికే అవకాశం లేదని చెప్పడంతో అందరూ కన్నీరు పెట్టారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)