ఈ టీ తాగితే చాలు... ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టవచ్చు ఈ టీ ని మన ఇంట్లోనే తక్కువ ధరకే ఈజీ గా తయారు చేసుకోవచ్చు

వర్షాకాలం వస్తే చాలు... జనాల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. వర్షంలో తడిసినా తడవకపోయినా ఇన్ఫెక్షన్ ద్వారా జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు దిబ్బడ, వాంతులు ఇలా ఎన్నో రోగాలకు అవకాశం ఉంటుంది. 
అయితే ఈ రోగాలతో పాటు మానసిక శారీరక ఒత్తిడి కి కూడా ఒక టీ తో చెక్‌ పెట్టవచ్చు. ఈ టీ ని మన ఇంట్లోనే తక్కువ ధరకే తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్ధాలు: 
అర లీటర్ నీరు, 
ఒక టేబుల్‌ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి, 
సగం టీ స్పూన్‌ అల్లం తరుగు , 
చిటికెడు పసుపు, 
2 యాలకులు;
తయారీ విధానం: 
పైన తెలిపిన వాటిని నీళ్ళలో కలిపి బాగా మరిగించి వడపోసుకోవాలి. తరవాత కావాలనుకున్న వారు పాలు, తేనె కలుపుకోవచ్చు. అయితే ఇందులో ఎట్టి పరిస్థితుల్లో పంచదార కలపకూడదు. ఈ టీ తాగితే చాలు... చాలా రోగాలు మనదరికి చేరవు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)