సొంత ఇల్లు మీ కలా ? ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది.

ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో కోరికలు, కలలలో సొంత ఇల్లు కట్టుకోవాలని అనే ఆశ ఉంటుంది. కాని సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క సారి ఎంత ప్లాన్ చేసినా కూడా ఎదో ఒక ఆటంకం, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అద్ది ఇంటి భాదలు, అప్పుల అవమానాలు ఇలా జీవితం సాగుతూ ఉంటుంది. అయితే వీటి గురించి ఒక పరిహారం ఉంది. గృహానికి, రుణానికి అధిపతి కుజుడు. ఈయన మంగళవారానికి అధిపతి. ఈ అంగారకుడిని నిత్యం పూజిస్తే, సొంత ఇల్లు భాగ్యం కలుగుతుంది.

నవగ్రహాలలో మూడవ గ్రహం అయిన కుజుడుని పూజిస్తే, అందులో కృష్ణపక్షం లో వచ్చే చతుర్ధశి, కృష్ణాంగారక చతుర్దశి మంగళవారం నాడు వస్తే అది చాలా విశేషమైన తిదిగా చెబుతారు. ఆరోజు కుజ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఇక ప్రతీరోజు కుజుడిని పూజించడం వలన, కుజుడి యొక్క అధిష్టాన దేవత అయిన సుభ్రమణ్య స్వామీని పూజించడం వలన గృహయోగం కలుగుతుంది. అయితే మంగళవారం నాడు ఇంట్లో ఎవ్వరు కూడా కందిపప్పు తినకూడదు. అలాగే ఎరుపు రంగు ఉండే ఫలాలు తినకూడదు. ఈ రకంగా కుజుడిని పూజిస్తే తప్పనిసరిగా గృహ యోగం కలుగుతుందని శాస్త్రాలు చెపుతున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)