చిల్కూరు బాలాజీ దేవాలయం మిగిలిన దేవాలయాలకు చాలా భిన్నంగా ఉంటుంది. అలాంటి ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

Loading...
హైదరాబాద్‌ వాసులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దైవం చిల్కూరు బాలాజీ. హైదరాబాద్‌ శివారులో ఉండే ఈ దేవాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూనే ఉంటుంది. ఇక ముఖ్యంగా శని, ఆదివారాల్లో భక్తుల రద్ది విపరీతంగా ఉంటుంది. భక్తులకు కొంగు బంగారంగా పేరు తెచ్చుకున్న చిల్కూరు బాలాజీ దేవాలయం మిగిలిన దేవాలయాలకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పద్దతులు మరియు అయ్యవార్ల పని తీరు వైవిధ్యంగా ఉంటుంది.
  • 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలోకి అందరు సమానమే అన్న రీతిలో దేవుడిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్లుగా వీఐపీ దర్శనం, టికెట్‌ దర్వనం, ఫ్రీ దర్శనం అంటూ ఉండదు.
  • ప్రస్తుతం ఏ దేవాలయాల్లో చూసినా కూడా హుండీ ఉంటుంది. కాని ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు. చిల్కూరు బాలాజీ భక్తుల నుండి కానుకలు తీసుకోవడం ఉండదు. 
  • ఇతర గుడుల్లో పూజలు, హారతులు ఇచ్చే సమయంలో అయ్యగార్లకు అంతో ఇంతో ఇవ్వాల్సి ఉంటుంది. కాని చిల్కూరులో మాత్రం అయ్యవార్లకు ఇవ్వనవసరం లేదు. 
  • చిల్కూరు బాలాజీని కొందరు భక్తులు వీసాల స్వామీ అంటారు. విదేశాలకు వెళ్లాలని కోరుకునే వారు స్వామివారిని కోరుకుంటే వారికి వెంటనే వీసా వస్తుందని నమ్మకం. 
  • ఇతర దేవాలయాల్లో కొబ్బరి కాయ కొట్టేందుకు, అర్చనకు, దర్శనంకు ఇలా అన్నింటికి టికెట్లు ఉంటాయి. కాని ఈ దేవాలయంలో మాత్రం వేటికి టికెట్లు ఉండవు. 
  • ఈ దేవాలయంలో ఏదైనా కోరిక కోరుకుని 11 ప్రదక్షిణలు చేస్తారు. అది నెరవేరితే 108 ప్రదక్షణలు చేసి మొక్కును చెల్లించుకుంటారు. ఇప్పటి వరకు లక్షల మంది 108 ప్రదక్షణలు చేసి ఉంటారు. 
  • ఈ దేవాలయ ప్రాంగణంలో 350 సంవత్సరాల రావి చెట్టు ఉంది. దాన్ని తాకితే మంచి జరుగుతుందని నమ్మకం.
  • ఒక్క హైదరాబాద్‌ నుండే కాకుండ ఎక్కడెక్కడి నుండో జనాలు బాలాజీ దర్శనంకు వస్తారు. 
  • హైదరాబాద్‌ నుండి విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్‌ వచ్చిన సమయంలో బాలాజీని దర్శించుకోకుండా వెళ్లరు. 
  • టెంపుల్‌ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఆ పత్రిక ద్వారా వచ్చే ఆదాయమే గుడి నిర్వహణకు ఖర్చు చేస్తారు.
Loading...

Popular Posts