కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అలసందలు తినండి అలసందలతో కలిగే ఆరోగ్యం అంతా ఇంతా కాదు

Loading...

చాలా మందికి అలసందలతో చక్కటి అనుబంధం ఉంటుంది. సరదాగా సాయంకాలం గుప్పెడు అలసంద గుగ్గిళ్లు తింటే ఆ మజానే వేరు. అలసందలతో చేసే కూరలను ఆబగా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా అలసందలతో చేసే వడలు యమా టేస్టీగా ఉంటాయి. అలసందలతో ఆరోగ్యానికి కలిగే లాభాల్లో కొన్ని ఇవి.
  • అలసందల్లో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించటంతో పాటు రక్తంలో చక్కెర శాతాన్ని సమతులం చేసే గుణం వీటికి ఉంది. గుండె జబ్బులు దరికి చేరవు.
  • ఒక కప్పు అలసందల్లో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కంటిచూపుతో పాటు చర్మంలో మృదుత్వం వస్తుంది.
  • అలసందల్లో విటమిన్‌-బి కూడా మెండుగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల కణజాల అభివృద్ధి జరుగుతుంది.
  • వీటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కండరాల శక్తితో పాటు జీవక్రియ సజావుగా సాగడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
  • అలసందలు తినడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తాయి ఇవి.
Loading...

Popular Posts