ఆఫీస్ లో మన వెనకాల గోతులు తవ్వి మనం ఎదగకుండా రాజకీయాలు చేస్తే ? వాటిని ఎదురుకునేందుకు చాణక్యుడు చెప్పిన అద్భుతమైన సూత్రాలు

Loading...
ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా, ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో రాజకీయాలు ఉండడం సహజం. తాను ఎదగడం కోసమో, లేదంటే ఇతరులను అణచడం కోసమో, ఇతర కారణాల వల్లో కొంత మంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు. అందుకు అవసరమైతే తమ తమ బాస్‌ల వద్ద లాబీయింగ్‌కు పాల్పడుతారు. చివరకు ఎలాగైతేనేం, తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు. 

అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు. కొందరు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ వారు కూడా ఇలాంటి రాజకీయాల బారిన పడాల్సి వస్తే? అప్పుడు ఏం చేయాలి? అందుకోసమే ఈ సూత్రాలను పాటిస్తే ఆఫీసు రాజకీయాల్లో మీరే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. 
  • ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత దాగి ఉంటుంది. దాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ బలహీనతలు ఉన్న వ్యక్తులు మనకు లొంగి ఉంటారు. ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ పక్కవారి బలహీనతలను తెలుసుకోవాలి. దీంతో వారిపై ఆధిపత్యం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఆ బలహీనతలను తెలుసుకోవాలంటే మాత్రం వారితో స్నేహం చేయాల్సిందే. అలా చేస్తేనే వారిపై పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది.
  • మనకు శత్రువులుగా ఉన్న వారి బలహీనతలను తెలుసుకోవడమే కాదు, సరైన సమయంలో వాటితో వారిపై అటాక్ చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఇతర పరిస్థితుల్లో మనం ఏం చేసినా వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.
  • ఇతరుల పట్ల మనకు తెలిసిన బలహీనతలను మరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు. అలా చేస్తే దాని వల్ల ఇతర వ్యక్తులు మనకన్నా ముందు దాని వల్ల లబ్ది పొందుతారు.
  • శత్రువులుగా ఉన్నవారు ఎప్పుడైనా బలహీనతలను లక్ష్యంగా చేసుకునే తమ తమ అస్ర్తాలను ప్రయోగిస్తారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
  • శత్రువులు మనకు పట్టుబడినప్పుడు వారు మనతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చినా వారిని ఎట్టి పరిస్థితిలోనూ నమ్మకూడదు.
  • ఎక్కడ, ఏ సందర్భంలోనైనా మనం మంచి నడవడిక, ప్రవర్తనతో మెలిగినప్పుడే ఇతరులు మనకు విలువనిస్తారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇతరుల దృష్టిలో మనం విలువను కోల్పోతాం.
  • మూర్ఖులుగా ఉన్న వారికి ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఒక వేళ ఇచ్చినా వారు వాటిని ఎలాగూ పాటించరు కనుక, మన విలువైన మాటలు వృథాగా పోతాయి. అంతే తప్ప, పెద్దగా ఫలితం ఉండదు.
  • పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్నే చిమ్ముతుంది కానీ మనతో మంచిగా ఉండదు ! అలాగే చెడు వ్యక్తిని చేరదీసి వారితో స్నేహంగా మెలిగినా వారు మాత్రం మనకు ఎల్లప్పటికీ చెడే తలపెడతారు. ఎందుకంటే వారికి చెడు చేయడంలోనే తృప్తి లభిస్తుంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...