మెంతులలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి. అనేక రోగాలకు మెంతులు దివ్వౌషదం

Loading...
మెంతులలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి. ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో ఉపకరిస్తాయి. శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే మెంతులు మనందరికీ తెలిసినవే. ఔషధ దినుసుగానూ ఆయుర్వేదంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ఇవి శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే మనకు అందుబాటులో ఉండే దినుసు. ఇటీవల కాలంలో మెంతులను మధుమేహన్ని అదుపులో ఉంచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మెంతులలో ఉండే ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకమైన వాసన, శరీరాన్ని పోషించే తత్వం తదితర లక్షణాల వల్ల ఇది అతి ప్రభావవం తమైన ఔషధంగా వాడుకలో ఉంది. విత్తనాలు మాత్రమే కాదు మెంతి ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివి. పెరటి మొక్కగానూ పెంచుకుంటూ రోజువారీగా వంటల్లో వాడుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.
 • అనేక రోగాలకు కారణమయ్యే కఫాన్ని, వాతాన్ని మెంతుల వాడకంతో తగ్గించవచ్చు. 
 • మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది దివ్వౌషదం. 
 • అధిక కొలెస్టరాల్‌ తగ్గించడానికి, శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ నిల్వలను నియంత్రిస్తుంది. 
 • అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. 
 • షుగర్‌ వ్యాధితో బాధపడేవారిలో మెంతుల వాడకం మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించడంలో మెంతులు పనితీరు అమోఘం. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం అరస్పూన్‌ మెంతిపొడి తీసుకుంటే చాలావరకు సమస్య తీరుతుంది. మెంతులు టైప్‌ 1, టైప్‌ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్‌, కౌమారిన్‌ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి.
 • ఇవి జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేసి.. ఆకలిని పెంచుతాయి. 
 • చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరిచే గుణం మెంతుల్లో ఉంది. 
 • నీళ్ల విరేచనాలను అరికట్టడంలో బాగా పనిచేస్తాయి. 
 • మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో అల్సర్లని తగ్గించడంతో పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. 
 • ఇందులోని చేదుగుణం కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. 
 • పునరుత్పత్తి సమస్యల్లోనూ మెంతులు ఔషధం గా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో ఉండే సపోనిన్స్‌లో ఫైటో ఈస్ట్రోజన్స్‌ తయారీకి ఉపయోగపడు తాయి. ప్రికర్సార్లు - డోయోస్‌ జెనిన్స్‌ మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
 • ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయం లోని చెడు రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది.
 • మెంతులు నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి నివారణలోనూ ఉపయోగించవచ్చు. ఎముకలను శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్‌, నడుము నొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది.
 • మెంతులను నీళ్లతో కలిపి పై పూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి.
Loading...

Popular Posts