షేర్ చేస్తే ఫేస్ బుక్ ఈ పిల్లలకి నిజంగా డబ్బులు ఇస్తుందా..?? నిజం తెలుసుకోండి

ఓ హాస్పిటల్ బెడ్ మీద ఓ చిన్న పాప..
దీనంగా మొహం పెట్టి ఉంటుంది..
ఒళ్లంతా వైర్లు కనెక్ట్ చెయ్యబడి ఉంటాయి..
“ఈ పాప క్యాన్సర్‌తో బాధపడుతోంది... ఈ ఫొటోని లైక్ చేస్తే 10 రూపాయలు, కామెంట్ చేస్తే 50 రూపాయలు, షేర్ చేస్తే 100 రూపాయలు ఫేస్ బుక్ఆ పాపకి షేర్ చేస్తుంది” అని ఓ కేప్షన్ ఆ ఫొటోకి తగిలించి ఉంటుంది.
మన ఫేస్ బుక్యూజర్లు అపర మానవతా వాదులు కదా.. అదీ పైసా ఖర్చు లేకుండా లైక్, కామెంట్, షేర్లతో చాటుకోగలిగే మానవత్వం అయ్యేసరికి ఆ పోస్ట్‌ని లైక్, కామెంట్, షేర్ చేయడం మొదలెడతారు.
మానవత్వం పేరు చెప్పి జనాల్ని బకరాలు చేసే ఇలాంటి ఓ పోస్ట్ గురించి విశ్లేషిద్దాం. ఈ క్రింద రెండు ఫొటోలు ఇస్తున్నాను. ఈ రెండూ ఒకే పాప ఫొటో.. ఒకడు కామెంట్కి 40 వస్తుంది అంటున్నాడు.. మరొకడు కామెంట్ చేస్తే 50 వస్తుంది అంటున్నాడు. అసలు 40 కరెక్టా, 50 కరెక్టా.. అలాగే షేర్ చేస్తే ఒకడు 50 వస్తుంది అంటున్నాడు, ఇంకొకడు ఏకంగా 100 వస్తుంది అంటున్నాడు.. ఇక్కడా ఏది కరెక్ట్?
ప్రతీ దానికీ ఓ లెక్క ఉండాలి కదా.. ఒకవేళ సపోజ్ పర్ సపోజ్ ఫేస్ బుక్ వాడు నిజంగానే డబ్బులు ఇస్తున్నాడు అనుకుందాం. వాడు ఓ లెక్క మెయింటైన్ చేస్తాడు కదా.. ఇలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటే ఎలా?

మరో కామెడీ ఏంటంటే.. ఫేస్ బుక్ USకి చెందిన సంస్థ. ఒకవేళ అది పేమెంట్ చేస్తే డాలర్లలో చేస్తుంది కానీ రూపాయల్లో చెయ్యదు. ఒకవేళ అది 1 డాలర్ ఇద్దామని అనుకుంటే 67 రూపాయలు అవుతుంది కానీ 50 రూపాయలో, 100 రూపాయలో కాదు. కాబట్టి తమ స్వార్థం కోసం ఇలాంటి పుకార్లు పుట్టించే వారికీ, గుడ్డిగా వీటిని నమ్మే వారికీ కనీస ఆలోచన ఉండాలి కదా.

ఫేస్ బుక్ నిజంగానే డబ్బులు ఇస్తుందా?
అస్సలు ఇవ్వదు. ఇలాంటి చెత్త తమ సైట్లో చలామణి అవుతోందని చాలా వరకూ ఫేస్ బుక్కి తెలీను కూడా తెలీదు. ఫేస్ బుక్ దాన ధర్మాలు చేసే సంస్థ కాదు. అది ఓ వ్యాపార సంస్థ. ఒకవేళ ఫేస్ బుక్ ధాన ధర్మాలు చేసే ఆలోచన ఉంటే… ప్రతీరోజూ మనం లేవగానే good morning అని ఎలాగైతే ఫేస్ బుక్ మనల్ని విష్ చేస్తోందో.. అలాగే “ఫలానా అమ్మాయికి క్యాన్సర్” అని ఓ ఫొటో పెట్టి నేరుగా ఫేస్ బుకే మన సహాయం కోరుతుంది. అయినా ఫొటో షేర్ చేస్తే ఫేస్ బుక్ కి వచ్చే లాభమేంటి? చదువుకున్న వారు కూడా ఆలోచించట్లేదు? Googleలో వెదికి ఓ ఫొటో పట్టుకుని దాని చుట్టూ ఓ కధ అల్లి ఇలాంటి స్కాములకి చాలా ఫేస్ బుక్ pages, వెబ్ సైట్స్ వాళ్లు పాల్పడుతున్నారు. బ్యాంకు అకౌంట్స్ నంబర్స్ ఇచ్చి డబ్బులు వేయమంటారు. కొంత మంది తెలివిగా ఆలోచిస్తున్నారు కాని కొంత మంది ఆ మాయ లో పడుతున్నారు.
పైసా ఖర్చు పెట్టకుండా మానవత్వం చాటుకునే అవకాశం వచ్చిందని ఇలాంటివి నమ్మే జనాలను చూసి జాలిపడడం తప్ప మనం ఏమీ చెయ్యలేం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)