స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఇంట్లో ఏం జరుగుతుందో చూసేయవచ్చు

Loading...
ఇప్పటి ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ లేని ఇల్లు అనేది లేదు. టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషి అవసరాలు కూడా సులభంగా తీరుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అర చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో చూసే స్థాయికి నేడు మనిషి చేరుకున్నాడు. ముఖ్యంగా తన ఇంటి ఆవరణలో కానీ ఇంటిలో కానీ ఏం జరుగుతుందో సెల్‌ఫోన్‌లోనే చూసుకునే సౌకర్యం ఇప్పుడొచ్చింది. దీని కోసం ప్రతి ఇంట్లో సీసీ కెమెరాల అవసరమూ పెరిగింది. ఇప్పుడూ సీసీ కెమెరాలు లేకుండానే మీ దగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌నే సీసీ కెమెరాగా మార్చేయొచ్చని తెలుసా. దీని కోసం ప్లే స్టోర్‌, ఆప్‌ స్టోర్‌లో కొన్ని ఆప్స్‌ ఉన్నాయి. వాటిని మీ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకొని మీ స్మార్ట్‌ఫోన్‌నే సీసీ కెమెరాగా, రిసీవర్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీ దగ్గర రెండు ఫోన్లు ఉండాలి. ఉదాహరణకు Free Wi-Fi Camera ఆప్‌ విషయానికొస్తే... ఈ ఆప్‌ను రెండు ఫోన్లలోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత రిసీవర్‌గా, రికార్డర్‌గా ఒక్కో ఫోన్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఓ గదిలో ఫోన్‌ని పెట్టి రికార్డు చేస్తూ, మీరు మరో గదిలో ఉండి వేరే ఫోన్‌లో చూసుకోవచ్చు. ఐఫోన్‌ వినియోగదారులైతే Manything home security camera ఆప్‌ ద్వారా ఈ సేవలు పొందొచ్చు.
Loading...

Popular Posts