కాకరకాయ రేచీకటికి, ఉబ్బసానికి సరైన ఔషధం...ఇంకా అనేక ఇతర ఉపయోగాలు.. ఎన్నో ఔషధగుణాలు

చాలామంది కాకరకాయలోని ఈ చేదును గమనించే దగ్గరకు రానీయరు. కానీ కాకరకు ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనిని కారవేల్లికా అని అంటారు.

కాకరకాయలు, ఆకులు క్రిమిసంహారులు, జ్వరహరములు. జీర్ణశక్తిని పెంచే గుణం కలవి. షుగర్‌ వ్యాధిని తగ్గిస్తాయి. ఇంకా అనేక ఇతర ఉపయోగాలు కూడా కాకర వల్ల సమకూరుతాయి. అరికాళ్ళ మంటలు ఉన్నప్పుడు కాకర ఆకుల్ని చేతితో నలిపి పిండితతే రసం వస్తుంది. ఈ రసాన్ని అరికాళ్లు రాస్తుంటే మంట తగ్గిపోతుంది.

రోజుకొక పచ్చి కాకరకకాయను తింటుంటే ఉబ్బసం తగ్గుతుంది. రోజు రోజూ గుణం కనబడుతుంది. తగ్గే వరకూ విడవకుండా వాడాలి. ఏలికపాములు పోవాలంటే కాకర గింజల చూర్ణం నీటితో లేక తేనెతో లోనికి తీసుకోవాలి. రెండు లేక మూడుసార్లు తీసుకుంటే ఏలిక పాములు పోతాయి.

శరీరంలో నొప్పులు ఉన్నప్పుడు అన్ని నొప్పులూ రోజుకొక పచ్చి కాకరకాయను తింటుంతే తగ్గిపోతాయి. కాకరకాయను పూర్తిగా ఒక్కసారి తినలేనప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క ముక్క చొప్పున తినవచ్చు. కుక్కకాటుకు కాకరను మందుగా వాడతారు. కుక్క కరిచినప్పుడు కాకరకాయను తినిపించి కరిచిన చోట గాయాన్ని కడిగిన తర్వాత కాకర ఆకుల్ని పిండి ఆ రసాన్ని గాయంపైన రాస్తారు. కొందరు కాకర ఆకుల్ని కట్టుకడతారు.

రోజుకొక పచ్చి కాకరకాయను తింటుంటే కొంతత కాలానికి అన్ని రకాల కుష్టు వ్యాధులు పోతాయి. రోజూ పచ్చి కాకరకాయ తినలేకపోతే కాకరకాయను కూరగా పండుకుని అయినా తినవచ్చు. చాలా కాలం తినవలసి ఉంటుంది. దీని వల్ల నిదానంగా అయినా తగ్గుతుంది.

కాకరకాయను మెత్తగానూరి మందంగా ఒక శుభ్రమైన గుడ్డపైన వేసి గడ్డలపైన వేసి కట్టు కడితే తగ్గుతాయి. లేదా కట్టు కట్టకపోయినా మందంగా పట్టు వేస్తూ ఉన్నా సరిపోతుంది. రోజూ కొంత కాకరకాయ తింటుంటే గొంతు రొంప పోతుంది.

కాకరకాయ రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి. రక్తలేమి(అనీమియా) కు పూటకు ఒక చెంచా కాకరాకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్థి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది. కాకరకాయ కూరను భోజనంలో కొంచెంగా తింటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది.

కాకరాకు రసా్ని రోజూ కంటి చుట్టూ కనురెప్పలకు రాస్తుంటే క్రమేపీ రేచీకటి తగ్గుతుంది. కాకరకాయ చేదుపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఉప్పుతో కాకరకాయను కడగడం వల్ల మజ్జిగలో కాకరకాయ ముక్కలను నానబెట్టడం వల్ల కాకరకాయలోని చేదు తగ్గుతుంది. అయితే చేదును పూర్తిగా తొలగిస్తే కాకరకాయలోని ఔషదగుణాలు తగ్గవచ్చు. కాకరకాయ పూర్తి ఔషధగుణాలతో ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా దానికి ఉన్న చేదు ఉండాల్సిందే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)