కీరదోస జ్యూస్ తో కేవలం ఒక నెలలో ఆరోగ్యంగా బరువు తగ్గి స్లిమ్ గా తయారవ్వచ్చు తయారీ విధానం చాలా ఈజీ

కీరదోసకాయ - ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పొటాషియం ఎక్కువ మరియు 95 శాతం నీరు కలిగి ఉంటుంది. కీరదోసకాయను తినడం మరియు కీరదోసకాయ జ్యూస్ తాగడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. అంతే కాదు కీరదోసకాయకు నిమ్మరసం జోడించి తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. 
కీరదోస మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ శరీరానికి డిటాక్సిఫై చేయడంతో పాటు , బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ మార్గం. ఈ నేచురల్ డ్రింక్ ను తయారుచేయడానికి మూడు ముఖ్యమైన పదార్థాలు అవసరం అవుతాయి. వాటిలో కీరదోస, లెమన్, మరియు పుదీనా. కీరదోసకాయ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు అద్భుతమైన డ్యూరియాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. 
అదే విధంగా నిమ్మరసం అసిడిక్ లక్షణం కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. మరియు ఫ్యాట్ బర్నింగ్ కాంపోనెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక పుదీన అద్భుత ఔషధాలు కలిగినది . అనేక న్యూట్రీషియన్స్ గలది మరియు ఇది స్టొమక్ యాసిడ్స్ ను నివారిస్తుంది. ఈ మూడు రకాల కాంబినేషన్ పదార్థాలు జీర్ణక్రియను పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి . పొట్టదగ్గర చేరిన అనవసర వ్యర్థాలను తొలగించడంలో ఈ డ్రింక్ గ్రేట్ గా పనిచేస్తుంది.
కావల్సినవి: 
కీరదోసకాయ: 1 లేదా 2 
నిమ్మకాయ: 1 
పుదీనా ఆకులు 10 
నీరు: 1లీటర్ 
తయారుచేయు విధానం: 
కీరదోసకాయను, పుదీనా ఆకులను కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను ఒక లీటర్ నీటిలో మిక్స్ చేసి ఫ్రెష్ లెమన్ జ్యూస్ ను అందులో జోడించాలి. తర్వాత మీకు ఇష్టమైతే కొన్ని ఐస్ ముక్కలు జోడించి చల్లచల్లగా లాంగించేయాలి. 
ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రిమార్క్ లేకుండా క్రమంగా బరువు తగ్గుతారు. మంచి మార్పు కనిపిస్తుంది . ఈ హెల్తీ హ్యాబిట్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందడంతో పాటు, స్లిమ్ గా తయారవుతారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)