ఇండియాలో కంపల్సరీ చూడాల్సిన న్యాచురల్ వండర్స్

  • మంచు శివలింగం అమర్ నాథ్ గుహల్లో ఉన్న ప్రవిత్ర ప్రాంతం ఐస్ శివలింగం కొలువైన ఆలయం. గుహలోపల ఐస్ తో శివలింగం ఏర్పడింది. ఈ శివలింగం ఆకారం ప్రతి ఏడాది మే నుంచి ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది. అత్యంత ఎక్కువ సందర్శకులు వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి.
  • బెరడు బ్రిడ్జ్ ప్రపంచంలో అత్యంత సహజంగా ఏర్పడిన సందర్శన ప్రాంతం ఇది. మేఘాలయకు సమీపంలో ఉన్న చిరపుంజిలో రెండు పెద్ద చెట్ల బెరడుతో.. బ్రిడ్జ్ ఏర్పడింది. ఈ వంతెన ఎవరైనా నిర్మించారా అన్నట్టు ఉంటుంది. కానీ.. ఇది కూడా న్యాచురల్ వండరే. ఈ బ్రిడ్జ్ ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఉపయోగిస్తారు.
  • బ్యాలెన్సింగ్ రాక్ తమిళనాడులోని మహాబలిపురంలో ఈ బ్యాలెన్సింగ్ రాక్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని శ్రీకృష్ణుడి వెన్నముద్ద అని కూడా పిలుస్తారు. ఇక్కడ గుహలో శివాలయం ఉంటుంది. అలాగే బీచ్ కి సమీపంలో.. ఈ రాయి ఉంది. దీన్ని చూస్తే.. పడిపోతుందేమో అనిపిస్తుంది. కానీ పడిపోదు. అందుకే.. ఇది న్యాచురల్ వండర్ అయింది.
  • హాట్ వాటర్ స్ప్రింగ్స్ హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉంది.. మణికరన్ పుణ్యక్షేత్రం. ఇక్కడ వేడి నీళ్లు ఎగిరిపడుతూ ఉంటాయి. అదే ఇక్కడ ఫేమస్. ఇది కూడా న్యాచురల్ గా ఏర్పడిన వండర్.
  • అయస్కాంతపు కొండ ఈ మ్యాగ్నెటిక్ హిట్.. లఢక్ కి దగ్గరలో ఉంది. శ్రీనగర్ నేషనల్ హైవేకి సమీపంలో ఉంది. కార్ లో ప్రయాణించేవాళ్లకు ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. ఈ కొండ అయస్కాంత తత్వాన్ని కలిగి ఉండటం విశేషం.
  • బొర్రా కేవ్స్ బొర్రా కేవ్స్ కూడా చాలా సహజంగా ఏర్పడినవే. ఇవి విశాఖపట్నంలోని అనంతగిరి కొండలు, అరకులోయలో ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత లోతైన గుహలు ఇవి. 80 మీటర్ల లోతులో ఉంటాయి.
  • చిర్ భట్టి ఇది.. చాలా న్యాచురల్ గా జరిగే.. విషయం. అంటే.. బన్ని గ్రాస్ లాండ్స్ లోని కుచ్ అనే ప్రాంతంలో రాత్రి అయ్యిందంటే చాలు.. వివరించలేని విధంగా.. లైట్లు కనిపిస్తాయి. ఇవి.. దయ్యాల రూపంలో కనిపిస్తాయని నమ్మకం ఉంది. ఈ లైట్స్ రెడ్, ఎల్లో, బ్లూ కలర్స్ లో ఏర్పడతాయట. ఇండియాలోని ఇదో న్యాచురల్ వండర్.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)