అక్కడ పుట్టుమచ్చ ఉంటే స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు

నొసలు సువిశాలంగా ఉంటే ఆ వ్యక్తి మంచి ఆలోచనా పరుడు అవుతాడు. అంతేకాదు కీర్తివంతుడవుతాడు. అటువంటి నుదుటి భాగాన మచ్చయున్న పురుషుడు పదిమందిలోనూ మంచివాడనిపించుకుంటాడు. పరోపకారి అవుతాడు. ధనధాన్యములకు లోటు ఉండదు.

ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. భోగము నందు ఆసక్తిని కలిగినవాడుగా ఉంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు.

ఇక కుడి కనుబొమ మీద మచ్చయున్న వివాహము త్వరితగతిన అవుతుంది. సుగుణశీలయైన భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు. ఈ పురుషుడు శాంత స్వభావమును కలిగి ఉంటాడు. కుడి కంటిలోపల మచ్చ యుండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు.

కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. వాహన సౌఖ్యము లభిస్తుంది. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు.
Loading...

Popular Posts

Latest Posts